కీలకమైన ఎన్నికల వేళ కొత్త టెన్షన్ వచ్చింది కేసీఆర్ సర్కారుకు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. ఎన్నికల వేడి ఇప్పటికే రాష్ట్రంలో రాజుకున్న వేళ.. తనపై వస్తున్న విమర్శలకు.. ఆరోపణలకు సమాధానాలు చెబుతూ.. ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు తాజాగా ఎదురైన సవాలు ఇబ్బందికరంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి వంతెన కొంత మేర కుంగిన షాకింగ్ ఉదంతం శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చోటు చేసుకుంది.
భారీ శబ్ధంతో బి బ్లాకులోని 18-21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోవటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. బ్యారేజీలోని 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లుగా అంచనా వేస్తున్నారు. బ్యారేజీ పొడవు1.6 కిలోమీటర్లు కాగా.. సంఘన జరిగిన ప్రాంతం మహారాష్టర నుంచి 356 మీటర్ల సమీపంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ బ్యారేజ్ మీదుగానే మహారాష్ట్ర – తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగుతుంటాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకల్నినిలిపివేశారు. గోదావరి నదిపై ఈ బ్యారేజ్ ను 2019లో నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఉదంతం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లర్ కుంగిన సమయానికి ఎగువ నుంచి జలశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తోంది. దీంతో 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో శబ్ధం రావటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
రెండు రాష్ట్రాల్ని కలిపే ప్రాంతంలో ఉన్న వంతెన కుంగటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాకపోకల్ని పోలీసులు నిలిపివేశారు. ఘటనాస్థలానికి వంతెనను నిర్మించిన ఎల్ అండ్ టీ కాంట్రాక్టర్లు హుటాహుటిన చేరుకున్నారు. మరోవైపు.. కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. చుట్టూ గాఢాంధకారం ఉండటంతో ఏం జరిగిందన్నది అర్థం కావట్లేదని.. ఉదయానికి మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డ్యాం పై భాగంలో భారీ శబ్దం వచ్చినట్లుగాచెబుతున్నారు.
ఇక్కడో అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. గడ ఏడాది 29 లక్షల క్యూసెక్కుల వరదను డ్యాం ఎదుర్కోవటం.. అప్పుడు కూడా ఎలాంటి శబ్దాలు రాలేదని.. అలాంటిది ఇప్పుడు శబ్దాలు రాకపోగా.. ఇప్పుడు మాత్రం రావటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసాంఘిక శక్తులు ఏమైనా చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా.. లోతైన దర్యాప్తు ద్వారా విషయాలపై మరింత స్పష్టత వస్తుందని చెప్పక తప్పదు.
This post was last modified on October 22, 2023 3:29 pm
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…