టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ రాష్ట్రస్థాయి నేతల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన మాతృమూర్తి విషయంలో సీఐడీ అధికారులు, జైలు అదికారులు వ్యవహరించిన తీరును వివరిస్తూ.. కన్నీటి పర్యంత మయ్యారు. `మా అమ్మను సీఐడీ అధికారులు బెదిరించారు. కేసులు పెడతామన్నారు. జైలులో ములాఖత్ అయిపోయినా.. టైం తెలియడం లేదా? అని విసురుగా మాట్లాడారు. ఇదేనా 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి సతీమణికి ఇచ్చే గౌరవం“ అంటూ.. నారా లోకేష్ కన్నీరు పెట్టుకున్నారు.
చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజల కోసం పోరాడారని నారా లోకేష్ పేర్కొన్నారు. ఆయనకు తప్పులు చేయడం తెలియదన్నారు. “ నా తల్లి ఐటీ రిటర్న్స్ చూపి కేసు పెడతామని బెదిరించారు. నా తల్లి ఏనాడైనా బయటకు వచ్చారా?. సేవా కార్యక్రమాలు తప్ప.. రాజకీయాలు నా తల్లికి తెలియదు. గవర్నర్ ను కలిసేందుకు కూడా నా తల్లి వెళ్లలేదు. నా తల్లి, భార్య కలిసి చంద్రబాబును చంపేందుకు కుట్రలు పన్నారంటూ మంత్రులు విమర్శిస్తారా? నా తల్లి.. బ్రాహ్మణి కలిసి చంద్రబాబుకు భోజనంలో విషం కలుపుతారట… భోజనంలో విషం కలపటం, బాబాయిని లేపేయడం వంటివి జగన్ డీఎన్‍ఏలోనే ఉన్నాయి“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
“తన తల్లిని, చెల్లిన అవమానించి.. రాష్ట్రం నుంచి గెంటేసిన వాడికి పొరుగు వారి తల్లి విషయంలో మర్యాద పాటిస్తారా?“ అని నారా లోకేష్ ప్రశ్నించారు. కాగా, నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని నారా లోకేష్ చెప్పారు. చంద్రబాబు జైలుపాలయ్యారన్న విషయంతో ఉద్విగ్నత చెంది మరణించిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తా రని తెలిపారు. భువనేశ్వరికి తోడుగా తెలుగు మహిళ నాయకులు కూడా ఉంటారని.. ఈ పర్యటనలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటనను కూడా అడ్డుకునేందుకు వైసీపీ శక్తులు ప్రయత్నించే అవకాశం ఉందని, రెచ్చగొడతారని అయినా.. మన పని మనం చేసుకుందామని నారా లోకేష్ చెప్పారు.
This post was last modified on October 21, 2023 8:23 pm
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…