మేం తెలంగాణ ఇచ్చామని ఒక పార్టీ. కాదు కాదు… అహర్నిశలూ కొట్లాడి తెలంగాణ తెచ్చామని మరోపార్టీ.. అసలు మేమే లేకపోతే.. తెలంగాణ వచ్చేదా? అని ఇంకో పార్టీ! వెరసి రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా.. తెలంగాణ ఏర్పాటు విషయం తాజా ఎన్నికల్లో మరోసారి చర్చనీయాంశంగానే మారిపోయింది. ఆయా పార్టీలకు సెంటిమెంటు అస్త్రంగానే ఉపయోగపడుతోంది. పల్లె నుంచి సిటీ గల్లీ వరకు…సెంటిమెంటును పండించేందుకు ఆయా పార్టీల మాటకారులంతా.. పోగవుతున్నారు.
సరే.. ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది కాబట్టి.. దేనిష్టం దానిది. అయితే, అసలు ప్రజల నాడి ఎలా ఉంది? ఇంకా సెంటిమెంటు కుంపట్లలోనే వారు పొద్దు పొడుచుకుంటున్నారా? ఇంకా నాటి సంగతులే తలుచుకుని.. పార్టీలకు అండగా ఉంటున్నారా? అసలు ప్రజల దృష్టిలో సెంటిమెంటు పండుతోందా? అనేది కీలక చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై ఆన్‌లైన్ చానెళ్లు కొన్ని సర్వేలు చేశాయి. నేరుగా గ్రామాల్లోని రచ్చబండలకెల్లెల్లి.. మైకు గొట్టాలు పెట్టినయి!
సెంటిమెంటుపై ప్రశ్నలు కూడా కురిపించినయి. అయితే, గ్రామీణ జనాభాలో దాదాపు ఎక్కడా ఇంకా సెంటిమెంటు కోసం కొట్టుకుంటున్న పరిస్తితి లేదు. “అది.. గైపోయిన ముచ్చట బిడ్డా! ఈ పదేళ్లలో నువ్వేం చేసినవో చెప్పు!!” అని ఒకరిద్దరు ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు. వారి అంతరంగం.. ఆత్మావలోక నం ఎలా ఉన్నా.. సెంటిమెంటు కోసం పాకులాడుతున్న పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు. అంటే.. సెంటిమెంటు పండడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది.
అయితే.. అక్కడక్కడా.. తెలంగాణ రాక విషయంలో కేసీఆర్‌కు ఎంత వెయిటేజీ ఇస్తున్నారో.. అంతే సమానంగా కాంగ్రెస్‌కు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరహా పరిస్థితి గత ఎన్నికల సమయంలో లేకపోవడం గమనార్హం. ఇక, పట్టణ ఓటరు విషయానికి వస్తే.. సెంటిమెంటును ఎక్కడా పట్టించుకోవడం లేదు. కరడు గట్టిన తెలంగాణ యువత కూడా.. సెంటిమెంటు క్లోజ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం.. అభివృద్ధి అనే అంశాలనే యువత ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సో.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ ఎస్ అయినా.. ఇతర పార్టీలైనా సెంటిమెంటు విషయంలో దూకుడు ప్రదర్శించడం సరికాదనేది తేలిపోయింది.
This post was last modified on October 21, 2023 11:59 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…