టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ తాజా మూవీ భగవంత్ కేసరికి సంబంధించి ఏపీ మంత్రి, వైసీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నా రు. సినిమాలకు, చంద్రబాబుకు లికెందుకు మంత్రివర్యా?! అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, బాబు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఈ నిరసనలను కార్నర్ చేస్తూ.. మంత్రి కారుమూరి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు అయ్యారన్న బాధలో ఉన్నామని పదే పదే చెబుతున్న నందమూరి బాలకృష్ణ.. తన తాజా సినిమా భగవంత్ కేసరిని ఎందుకు వాయిదా వేసుకోలేదు? అని ప్రశ్నించారు. అంటే.. ఆయనకు ఆదాయం కావాలి.. సాధారణ కార్యకర్తలకు మాత్రం రోజు వారీ పనులు మానుకుని మరీ.. నిరసనలు తెలపాలా? అని ప్రశ్నించారు.
ఇక, హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయని ఆ సంస్థ ప్రకటించడంపైనా మంత్రి అక్కసు వెళ్లగక్కారని నెటిజన్లు అంటున్నారు. “రాష్ట్రం అంతా రోడ్డెక్కాలని పిలుపు ఇస్తారు. కానీ బాలయ్య, చంద్రబాబు కుటుంబ సభ్యులు సంపాదన మాత్రం మానుకోరు” అని మంత్రి వ్యాఖ్యానించారు.
“చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అల్లర్లు ఎందుకు? ఆయనేమైన దేవుడా. ఇందిరాగాంధీ నుంచి దేశంలో పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు?. వాళ్ళందరికంటే చంద్రబాబు గొప్పోడా?. దేశ చరిత్రలో నేరగాడికి ఏసీ, అటాచ్డ్ బాత్ రూమ్ ఇచ్చింది చంద్రబాబుకే” అని మంత్రి కారుమూరి అన్నారు.
This post was last modified on October 19, 2023 8:04 pm
కరోనా దెబ్బకు ఆల్రెడీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఏవైనా పెద్ద, ఈవెంట్ సినిమాలు రిలీజైనపుడే థియేటర్లు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి…
ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…
తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన…
రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు…