టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత 40 రోజులకు పైగానే ఆయన బెయిల్, కేసులు, ఏపీ సర్కారు ఉద్దేశ పూర్వక చర్యలపై టీడీపీ నాయకులు అంతా పోరుబాట పట్టారు. ఇటు న్యాయస్థానం, అటుప్రజల్లోకి కూడా వెళ్లి.. వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. దీంతో కీలకమైన ఎన్నికలకు ముందు.. టీడీపీ కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. అందరూ చంద్రబాబు కోసమే ఉద్యమిస్తున్నారు తప్ప.. ఎన్నికలపై దృష్టి పెట్టలేక పోతున్నారు.
దీంతో పార్టీ పరంగా ఎన్నికలకు ముందుకు వెళ్లే పరిస్థితి కొంత మేరకు మందగించింది. దీనిని గమనించిన పార్టీ యంత్రాంగం.. తాజాగా ఉన్నతస్థాయిలో చర్చలు జరిపింది. పార్టీ కీలక నాయకులు తాజాగా చర్చించారు. ఈ క్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ప్రజా క్షేత్రంలోకి దింపాలని ముక్తకంఠంతో నిర్ణయించారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి త్వరలోనే ప్రజల్లోకి వచ్చేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు.
చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను కూడా ఈ యాత్ర రూపంలో నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటన ఉండేలా టీడీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో ఆగిపోయిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ జనంలోకి వెళ్లనున్నారు. పార్టీ కార్యక్రమాలపై నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. బాబుతో నేను కార్యక్రమం నిర్వహిస్తూనే ప్రజల సమస్యలపై పోరాటాలు, పార్టీ కార్యక్రమాల స్పీడు పెంచాలని కీలక నేతలు నిర్ణయించారు.
This post was last modified on October 18, 2023 10:36 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…