Political News

కేసీఆర్ పాల‌న దుర‌దృష్ట‌క‌రం: ప్రియాంక గాంధీ

ఎన్నో ఆకాంక్ష‌ల‌తో ఎంతో మంతి ప్రాణ త్యాగాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాల‌న దుర‌దృక‌రంగా సాగింద‌ని కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు, సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ పాల‌న‌లో ఏ ఒక్క‌రూ ఆనందంగా లేర‌ని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌యేన‌ని.. చెప్పారు. ఎన్నోకోరిక‌ల‌తో నీళ్లు-నియామ‌కాలు నినాదంతో ఏర్ప‌డిన రాష్ట్రంలో ఏ ఒక్క‌రికీ సామాజిక‌న్యాయం జ‌ర‌గ‌లేద‌న్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్రియాంక గాంధీ చెప్పారు.

“తెలంగాణ ఒక పుణ్యభూమి. తెలంగాణ కోసం ఎంతోమంది జీవితాలు త్యాగం చేశారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చాం. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణ ఇచ్చాం. కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇస్తుంది” అని ప్రియాంకగాంధీ అన్నారు. కేసీఆర్ పాల‌న కేవ‌లం కుటుంబ స‌భ్యుల‌కుఉద్యోగాలు ఇచ్చేందుకు, వారు చేసిన అవినీతి నుంచి వారిని కాపాడుకునేందుకు మాత్ర‌మే ప‌రిమితం అయింద‌ని చెప్పుకొచ్చారు.

“తొమ్మిదేళ్ల తెలంగాణలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యలు, ఆధిపత్యమే కనిపిస్తుంది. రాష్ట్రాన్ని రక్షించేందుకు సోనియా గాంధీ కుటుంబం మీ ముందుకు వచ్చింది. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన విష‌యం మీకు తెలిసిందే. అయినా.. ఈ ప‌దేళ్ల‌లో ఇక్కడి ప్ర‌జ‌ల ఆకాంక్షలు ఏ మాత్రం నెరవేరలేదు. అందుకే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇచ్చారు. పేద ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తాం. ములుగులో సీతక్కను, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావును గెలిపించాలి“ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ములుగు జిల్లా రామాంజపురంలో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార‌ సభలో ప్రియాంకగాంధీ ప్ర‌సంగించారు.

This post was last modified on October 18, 2023 10:34 pm

Share
Show comments
Published by
satya
Tags: BRSKCR

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

9 hours ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

12 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

12 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

13 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

14 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

15 hours ago