తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ఊపందుకుంది. ప్రతిపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నాయి. టికెట్లు, అభ్యర్థులు, ప్రచారం, చేరికలు అంటూ.. పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అయితే.. అధికారంలోకి వచ్చేస్తామని.. తెలంగాణను రాజన్న రాజ్యంగా మారుస్తామని ఎప్పటి నుంచో చెప్పుకొచ్చిన.. వైఎస్సార్ తెలంగాణపార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మాత్రం కీలకమైన ఎన్నికల సమయంలో సైలెంట్ అయిపోయారు.
నామినేషన్లకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. కనీసం ఎక్కడా ఎన్నికల గురించిన ప్రకటన చేయడం లేదు. అభ్యర్థుల కోలాహలం కూడా పార్టీలో కనిపించడం లేదు. ఇతర పార్టీలను చూస్తే.. అభ్యర్థుల ఎంపిక కోలాహలం కనిపిస్తోంది. టికెట్లు వచ్చిన వారు హర్షం వ్యక్తం చేస్తుండగా.. రానివారు.. తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇలా.. రాజకీయ వాతావరణం వేడెక్కిన దరిమిలా షర్మిల పార్టీ కూడా అంతే ఊపుతో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావించారు.
కానీ, అనూహ్యంగా షర్మిల పార్టీ వ్యవహారం ఎక్కడా వినిపించడం లేదు. కనిపించడం లేదు. అయితే.. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకుడు.., పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రామిరెడ్డి మాత్రం సంచలన ప్రకటనలు చేశారు. గడిచిన 4 రోజుల నుంచి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థుల నుంచి అప్లికేషన్ తీసుకుంటు న్నామన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపు 5 నుంచి 10 అప్లికేషన్లు వస్తున్నాయని తెలిపారు.
ప్రజల్లో రాజన్న బిడ్డ పై ఉన్న అభిమానం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి అద్భుతం సృష్టించబోతుం దని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గం ల నుంచి 377 అప్లికేషన్స్ వచ్చాయన్నారు. ఒక్క ఎల్బీ నగర్ నుంచి 10 అప్లికేషన్స్ వచ్చాయని వివరించారు. మిగితా పార్టీ ల నుంచి కూడా నాయకులు పోటెత్తుతున్నారని చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన వారి నుంచి టికెట్ ఆశిస్తూ.. 50 అప్లికషన్లు వచ్చాయని తెలిపారు. సీఎం కెసిఆర్ ను ఎదుర్కొనే ఒక్కే ఒక్క నాయకురాలు షర్మిల మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on October 18, 2023 10:31 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…
మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…
ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…
సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్…