Political News

బరాబర్ అంటా..కవితకు అర్వింద్ కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ ధర్మపురి అర్వింద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల మధ్య వాగ్వాదం నడుస్తోంది. బతుకమ్మ పండుగ చేసుకునేందుకు వచ్చిన తన గురించి అర్వింద్ అసభ్యకరంగా, అభ్యంతరకంగా మాట్లాడారని కవిత మండిపడ్డారు. కేసీఆర్ బిడ్డను కాబట్టి, ఏది పడితే అది మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

ఆ మాటలే వారి ఇంట్లో ఆడవారిపై మాట్లాడితే భరించగలరా? అని అర్వింద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా పాలకులు కూడా ఇంత దారుణంగా మాట్లాడలేదని అన్నారు. అర్వింద్ వంటి బూజు పట్టిన వ్యక్తులను మార్చాల్సిన సమయం వచ్చిందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే కవిత కామెంట్లకు అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. అయ్యొపాపం కవితకు బాగలేనట్టున్నది. కేసీఆర్ గారి కూతురు. ఎన్నడు ఏపాపం చేయలే.. రూపాయి తినలేదు అంటూ చురకలంటించారు.

కవిత ఏనాడూ తెలంగాణ ప్రజలను ముంచలేదు, వంద రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీ తెచ్చింది, పసుపు బోర్డు తెచ్చింది అంటూ ఎద్దేవా చేశారు. ‘‘నీ జీవితానికి నీవుండే స్థాయికి నీవు అర్హురాలివి కాదు, మీ నాన్న కేసీఆర్‌ చేసిన పాపాలు మీ వల్లనే చేసిండు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చచ్చిపోతే రూ.10 లక్షలు ఇస్తారా? కోవిడ్‌ సమయంలో ప్రజలు లక్షల డబ్బులు కడుతున్నా ఒక్కరికైనా ఆరోగ్య శ్రీ ఇచ్చినావా కేసీఆర్‌? అని ప్రశ్నించారు. చచ్చిపోతే ఇస్తా అనుడు మీ దొరబుద్దులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుకే మీరు చస్తే బిల్‌కుల్‌ డబ్బులు ఇస్తా అన్నా అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. నువ్వు తెలంగాణ ఆడ బిడ్డవా? ఇట్లనే చేస్తారా తెలంగాణ ఆడబిడ్డలు? అని కవితను ప్రశ్నించారు. నేను ఇంట్లో లేనప్పుడు మా అమ్మ ఇక్కటే ఉన్నప్పుడు కొందరిని ఇంటికి పంపి కుర్చీలు పగలగొట్టినప్పుడు ఏమైంది నీ ఆడపడచుదనం అని మండిపడ్డారు. నువ్వేమో ఆడపడుచువి.. మా అమ్మ ఆడపడుచుకాదా? అని ప్రశ్నించారు. నన్ను చెప్పుతో కొడతా అంటావు.. నీకు అంత సీన్‌ ఉందా? అని ఫైర్ అయ్యారు. ఆంధ్రోళ్లను కుక్కలు అన్న మాటలు మరిచిపోయారా? అని ప్రశ్నించారు.

This post was last modified on October 18, 2023 4:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎంపీలో ఘోరం!… శోభనానికి ముందు కన్యత్వ పరీక్ష!

దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…

4 minutes ago

‘సిండికేట్’ : ఆర్జీవీ పాపాలను కడగనుందా?

రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…

9 minutes ago

టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. భారత్ అభ్యంతరం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…

24 minutes ago

వివాదాలు ఓకే….అసలు విషయం వీకే

తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…

25 minutes ago

టికెట్ల ధరల మర్మం తెలిసిందా?

కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…

37 minutes ago

ఫౌజీ ప్రపంచంలో ఊహకందని మలుపులు

ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ఫౌజీ టైటిల్…

54 minutes ago