Political News

గుర్రం ఎగ‌రా వ‌చ్చు.. సీఎం కానూవ‌చ్చు: జానా రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “గుర్రం ఎగ‌రావొచ్చు.. నేను సీఎం కానూ వ‌చ్చు.. ఎవ‌రు మాత్రం చెప్ప‌గ‌ల‌రు” అని ఆయ‌న ఆస‌క్తిగా వ్యాఖ్యానించారు. సుమారు 50 ఏళ్ల‌కుపైగా రాజ‌కీయా ల్లో ఉన్న జానారెడ్డి తొలుత టీడీపీలో రాజ‌కీయ పాఠాలు నేర్చారు. అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాంలోనే ఆయ‌న మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త‌ర్వాత‌..అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ బాట ప‌ట్టారు. ఈ పార్టీలోనూ అనేక కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టారు. వైఎస్ హ‌యాంలో హోం మంత్రిగా ప‌నిచేశారు.

న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన కుందూరు జానా రెడ్డి ప్ర‌స్తుతం కాంగ్రెస్ అసంతృప్తుల బుజ్జ‌గింపుల క‌మిటీ కి చైర్మ‌న్‌గా ఉన్నారు. సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఆయ‌న కుమారుడికి ఇప్పించుకున్నారు. అయితే.. తాజాగా ఆయ‌న మ‌న‌సులో మాట చెప్పుకొచ్చారు. ప్రజల హృదయాల్లో తాను ముఖ్య‌మంత్రి కావాలని ఉందని జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడులో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“నాకు నేనుగా ఏ పదవీ కోరుకోవట్లేదు. రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమో. ఏ పదవి వచ్చినా కాదనను. ఏ ముఖ్య‌మంత్రి, ఏ నాయ‌కుడు ఇప్ప‌టి వ‌ర‌కు చేయనన్ని శాఖలు నేను చేశా. మంత్రిగా అనేక శాఖ‌లు చూశా. యువ‌కుడిగా ఉన్న‌ప్పుడు 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చా. 36 ఏళ్లకే మంత్రిని అయ్యా. నాకు 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. నాకు ఏ పదవులైనా వాటంతట అవే వస్తాయి. ముఖ్య‌మంత్రి కావాల‌నేది ప్ర‌జ‌ల ఇష్టం” అని జానారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఇది ఆయ‌న మ‌న‌సులో మాటేన‌ని కాంగ్రెస్ నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు.

This post was last modified on October 18, 2023 8:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago