ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబును శుక్రవారం వరకు అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను కూడా శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వ్యవహారంపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. శుక్రవారం నాడు తీర్పు వెల్లడిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది. సెక్షన్ 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్నదానిపైనే ప్రధానంగా ఈ రోజు విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ఇరు వర్గాల లాయర్ల మధ్య వాడీవేడీ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున ప్రముఖ లాయర్లు సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వేలు వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 482 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ రద్దు కుదరదని రోహత్గీ వాదించారు. అవినీతి కేసులో చంద్రబాబుకు 17 ఏ వర్తించినా…మిగతా సెక్షన్స్ లో వర్తించదని ఆయన వాదించారు. అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తానని కోర్టుకు సాల్వే తెలపగా…దానికి కోర్టు అంగీకరించింది.
మరోవైపు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్ పై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేయడంతో చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై మంగళవారం ఉదయం హైకోర్టు విచారణ జరిపిన హైకోర్టు…తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. బాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్ మెంట్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, కాబట్టి ఆ కేసు కొట్టేయాలని ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చడంతో చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు వాదనలు పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది.
This post was last modified on October 17, 2023 8:25 pm
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…