తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అన్ని ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించగా….కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి ఎన్నికలలో విజయం సాధించాలన్న తపనతో ఉన్నారు. ఇటువంటి తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ కు ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య షాకిచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా చేస్తున్నానని సంచలన ప్రకటన చేశారు. రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పొన్నాల పంపించారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని పొన్నాల ఆరోపించారు. పార్టీ అంశాలు చర్చించేందుకు తనకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. కొందరు నాయకుల వైఖరితో పార్టీ పరువు పోతోందని, బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో తనకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదని , సర్వేల పేరుతో బీసీలకు సీట్లు ఎగ్గొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి నమస్తే పెట్టినా స్పందించరని ,సొంత పార్టీలోనే పరాయివాడిలా అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, జనగామ టికెట్ ను పొన్నాలకు కాకుండా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కేటాయిస్తారన్న ప్రచారం నేపథ్యంలోనే పొన్నాల రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కూడా లాస్ట్ మూమెంట్ లో పొన్నాలకు టికెట్ ఇచ్చారు. పొత్తులో భాగంగా కోదండరామ్ ను కాదని పొన్నాలకు టికెట్ ఇచ్చినా ఆయన ఓడిపోయారు.
This post was last modified on October 13, 2023 6:56 pm
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…