రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భయంకర పరిస్థితిలో ఉన్నారని ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కలుషిత నీరు, దోమలు, వెంటిలేషన్ లేకపోవడం వంటి కారణంగా చంద్రబాబు అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల తమ కుటుంబం ఆందోళనగా ఉందన్నారు. కుట్ర పూరితంగానే చంద్రబాబును జైల్లో నిర్బంధించారని విమర్శించారు.
ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వం కూడా చంద్రబాబు ఆరోగ్యం విషయంలో వాస్తవాలను దాస్తున్నారని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్ దే బాధ్యతని తేల్చి చెప్పారు. ఈ మేరకు నారా లోకేష్ ట్వీట్(ఎక్స్) చేశారు. ఇదిలావుంటే, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి, కుమారుడు, కోడలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తన భర్త ఆరోగ్యంపై తమకు ఆందోళనగా ఉందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఇన్‌ఫెక్షన్, అలర్జీతో చంద్రబాబు బాధపడుతున్నారని, అపరిశుభ్ర జైలులో నిర్బంధించడం హృదయ విదారమని అన్నారు. మరోవైపు చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కూడా బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. బాబు ఆరోగ్యంపై కుటుంబమంతా తీవ్ర ఆందోళనతో ఉందని తెలిపారు. ఇదిలావుంటే, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు(శుక్రవారం) జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులను అరెస్టు చేశారు.
This post was last modified on October 13, 2023 4:54 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…