ఎలక్షన్లకు ఆర్నెళ్ల ముందు జగన్ స్పీడు పెంచుతున్నారు. వైసీపీ గ్రాఫ్ పడిపోతుందన్న అంచనాల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగుతున్నారు. ఆ క్రమంలోనే కంటికి కనిపించే పనులు చేయడం ప్రారంభించారు. ఇంతకాలం లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు వేయడంపైనే పూర్తి ఫోకస్ చేసిన జగన్ ఇప్పుడు వేరే సంక్షేమ పనులు, అభివృద్ధిపైనా దృష్టి పెడుతున్నారు. తాజాగా సామర్లకోటలో వెయ్యికి పైగా ఇళ్లకు ఒకేసారి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించడం అందులో భాగమే.
దాంతో జగన్ ప్రభుత్వం కొన్నాళ్లుగా ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. సామర్లకోటలో సుమారు వెయ్యి ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి సామూహిక గృహ ప్రవేశాలతో మైలేజ్ తెచ్చుకుంది.
నిజానికి జగన్ ప్రభుత్వం 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేసింది. ఇది చాలా పెద్ద నంబరే. అయితే… ఆ స్థలాలలో ఇళ్ల నిర్మాణం ఆలస్యం కావడంతో అపఖ్యాతి మూటగట్టుకుంది. 30.75 లక్షల మందికి మొత్తంగా 71,811 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఇందులో ఇప్పటివరకు 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది జగన్ ప్రభుత్వం. అయితే, అందులో 2.62 లక్షల టిడ్కో ఇళ్లు ఉన్నాయి.
ఇంటి స్థలాన్ని ఫ్రీగా ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ. 1.80 లక్షల వరకు బిల్లు చెల్లిస్తోంది. దీనికి అదనంగా రూ. 15 వేల విలువైన ఇసుక ఉచితంగా ఇస్తోంది. ఐరన్, సిమెంట్‌పై రూ. 40 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. డ్వాక్రా మహిళలైతే రూ. 35 వేలు పావలా వడ్డీకి ఇస్తోంది.
కాగా ప్రభుత్వ సహాయంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని.. మరో 14 లక్షల ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తికానుందని జగన్ చెప్తున్నారు. తాము ఇళ్లు నిర్మించడం కాదని.. ఏకంగా ఊళ్లే నిర్మిస్తున్నామని జగన్ చెప్తున్నారు.
This post was last modified on October 12, 2023 10:15 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…