ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసే పరిణామాలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ఆత్మహత్య వ్యవహారం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. నాలుగు రోజుల కిందట ఏపీ ప్రభుత్వాన్ని చెడామడా తిడుతూ ఒక వీడియోలో కనిపించిన వ్యక్తి.. ఆత్మహత్యకు పాల్పడం సంచలనం రేపుతోంది. ఆ వ్యక్తి పేరు ఓం ప్రతాప్. ఈ వ్యక్తి విషాదాంతం గురించి తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ ట్విట్టర్లో వెల్లడించాడు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమాల మండలం, కందూరు గ్రామానికి చెందిన ఓం ప్రతాప్ కొన్ని రోజుల కిందట జగన్ సర్కారు మద్యం పాలసీపై విరుచుకుపడుతూ ఓ వీడియో పెట్టాడు. అందులో మద్యం బాటిల్ పట్టుకున్న అతను.. ఏపీలో ఊరూ పేరూ లేని బ్రాండ్లను అధిక రేట్లు పెట్టి అమ్ముతున్నారని, దీని వల్ల తాను అప్పుల పాలు కావాల్సి వచ్చిందని అతను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పరుష పదజాలంతో తిట్టిపోశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఐతే ఈ వీడియో బయటికి వచ్చిన ఐదు రోజులకే ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం జగన్‌ను దూషించిన నేపథ్యంలో అతణ్ని చంపేస్తామని వైకాపా నాయకుల బెదిరించారని, పోలీసులు కూడా కేసులు పెడతామని హెచ్చరించారని.. ఈ భయంతోనే ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడని సన్నిహితులు అంటున్నారు. ఈ ఉదంతంపై విచారణ జరిపించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఓం ప్రతాప్ దళితుడని, దళితులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా.. వారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అని నారా లోకేష్ అన్నారు.
This post was last modified on August 26, 2020 2:18 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…