స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడిషల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ క్రమంలోనే ఆ తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫున న్యాయవాదులు హైకోర్టు తలుపుతట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 17 కు హైకోర్టు వాయిదా వేసింది.
ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ సిఐడి అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు సోమవారం వరకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక, అంగళ్లు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణలు జరగనున్నాయి. ఫైబర్ నెట్ కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని, అంగళ్లు కేసులో ఈరోజు వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది.
తమ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు చంద్రబాబు పీటీ వారెంట్లు, సిఐడి కస్టడీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని విజయవాడ ఏసీబీ కోర్టుకు కూడా ఏపీ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, చంద్రబాబు తరఫున సిఐడి అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్లపై పాస్ ఓవర్ కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. ఇక, సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడుతూనే ఉంది. ఇరు పక్షాల వాదనలూ విన్న ధర్మాసనం రేపటికి తదుపరి విచారణ వాయిదా వేసింది.
This post was last modified on October 12, 2023 1:20 pm
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…