ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే కేసీయార్ యాక్టివ్ అయిపోతున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి తన షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. పార్టీ ఆఫీస్ లో 15వ తేదీన అభ్యర్ధులందరితో భేటీ పెట్టుకున్నారు. ఈలోగానే మ్యానిఫెస్టోకి రూపకల్పన చేయబోతున్నారు. అదే రోజు అందరికీ బీఫారాలు అందించాలని డిసైడ్ అయ్యారు. ఎక్కడైనా అభ్యర్ధుల మార్పులు చేర్పులు చేయాలంటే ఈలోపే చేసేయాలని కూడా అనుకున్నారు. 16వ తేదీన హుస్నాబాద్ లో ప్రచారాన్ని లాంఛనంగా మొదలుపెట్టి మరుసటి రోజునుండి జిల్లాల పర్యటనలో బిజీ అయిపోవాలని అనుకుంటున్నారు.
గతంలో ప్రకటించినట్లుగా 16వ తేదీన జరగాల్సిన వరంగల్ బహిరంగ సభ వాయిదా వేసుకున్నారు. నవంబర్ 9న గజ్వేలు, కామారెడ్డి లో నామినేషన్లు వేయాలని డిసైడ్ అయ్యారు. మొత్తానికి షెడ్యూల్ ప్రకటన అన్నది పార్టీల్లో ఒక్కసారిగా చురుకు పుట్టించింది. పైగా మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నది. ఏ ఏ నియోజకవర్గాల్లో పర్యటనలు చేయాలనే విషయంలో ఇప్పటికే కేసీయార్ ఒక రూట్ మ్యాప్ వేసుకున్నారు.
చాలాకాలంగా హుస్నాబాద్ నుండి ఎన్నికల సభలు మొదలుపెట్టడం కేసీఆర్ సెంటిమెంటు. ఇపుడు కూడా అదే పద్దతిలో ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. 9 నెంబర్ అంటే కేసీయార్ కున్న సెంటిమెంటు కారణంగా అదేరోజు గజ్వేలు, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్ వేయాలని డిసైడ్ అయ్యారు. అదేరోజు మధ్యాహ్నం కామారెడ్డిలో భారీ బహిరంగసభ కూడా జరపాలని అనుకున్నారు. పోటీచేస్తున్న రెండు నియోజకవర్గాల్లోను భారీ మెజారిటితో గెలవాలన్నది కేసీయార్ టార్టెట్. అందుకనే గజ్వేలు బాధ్యతలను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఇక కామారెడ్డిలో గెలుపు బాధ్యతలను మంత్రి కేటీయార్ కు అప్పగించారు.
16వ తేదీన బహిరంగసభ 26 లేదా 27 తేదీల్లో జరగబోతోంది. రెగ్యులర్ గా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిపై కేసీయార్ సర్వేలు చేయించుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా అదే పద్దతిలో వారానికి ఒక సర్వే రిపోర్టు తెప్పించుకోబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. గెలుపు లక్ష్యంతో అనుమానంగా ఉన్న నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు, ఎంపీలు, ఎంఎల్సీలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా పెద్ద బృందాన్ని రెడీ చేశారట. మొత్తానికి షెడ్యూల్ ప్రకటించటమే ఆలస్యం కేసీయార్ రంగంలోకి దిగేస్తున్నారు.
This post was last modified on October 10, 2023 1:13 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…