తెలంగాణా బీజేపీపై బండి సంజయ్ ప్రభావం చాలా ఉందని సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తీసేసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించారు అగ్రనేతలు. నిజానికి బండిని తొలగించి కిషన్ కు బాధ్యతలు అప్పగించటం వల్ల పార్టీకి వచ్చిన లాభం ఏమీలేదు. అయినా సడెన్ గా బండిని పక్కనపెట్టేశారు. దాంతో అప్పట్లోనే బండిని తొలగించటం తప్పుడు నిర్ణయమని పార్టీలోని చాలామంది సీనియర్లు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని అగ్రనేతలకు స్పష్టంగా చెప్పారు కూడా.
అయితే ఎవరెంత చెప్పినా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. అయితే బండి స్ధానంలో కిషన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇద్దరి మధ్య తేడా అర్ధమైపోయింది. బండి స్పీచులో ఉన్న పంచ్ కిషన్ మాటల్లో ఉండదు. ప్రతిరోజు బండి పార్టీ తరపున ఏదో ఒక కార్యక్రమం పెట్టేవారు. పాదయాత్రలని, ఆ యాత్రలని, ఈ యాత్రలని ఏదో ఒకటి జనాలతో మమేకం అయ్యేట్లుగా షెడ్యూల్ ఉండేది. 24 గంటలూ 365 రోజులు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా బండి రాజకీయం ఉండేది.
పైగా బండి బీసీ నేత కాబట్టి బీసీల్లోను ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్, కదలిక ఉండేది. సీనియర్లందరినీ బండి కలుపుకుని వెళ్ళేవారు కాదనే ఆరోపణలు తరచూ వినబడేవి. అయితే ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా ఇలాంటి ఆరోపణలు మామూలే. ఎందుకంటే అధ్యక్షుడిగా ఎవరున్నా నేతలందరు మూకుమ్మడిగా మద్దతు తెలపటం అన్నది ఎప్పుడూ ఉండదు. కాబట్టి సీనియర్లలో కొందరికి ఎప్పటికీ అధ్యక్షుడిపైన అసంతృప్తి ఉంటుంది.
అయితే ఇపుడు తెలంగాణాలో పరిస్ధితులను గమనించిన తర్వాత బండిని తొలగించి తప్పుచేశామనే ఆలోచన ఢిల్లీ పెద్దల్లో మొదలైందని పార్టీవర్గాల సమాచారం. ఎందుకంటే బీజేపీలో చేరటానికి ఇతర పార్టీల నేతలు పెద్దగా ముందుకు రావటంలేదట. ఎందుకంటే పార్టీలో జోష్ పడిపోవటమే కాకుండా అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా పడిపోయిందట. నవంబర్ 30 వ తేదీ పోలింగ్ కు ముందు బీజేపీపై ఇలాంటి ముద్ర పడటం మంచిది కాదని అగ్రనేతలు అనుకుంటున్నారట. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో అగ్రనేతలు ఎలాగ ఆలోచించినా ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిందే.
This post was last modified on October 10, 2023 1:11 pm
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…