టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించి ఈ రోజు విజయవాడలోని ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు కీలక తీర్పులు వెలువరించనున్న సంగతి తెలిసిందే. మురోవైపు, సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబుకు జడ్జిమెంట్ డే అని, ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా భావించారు. కానీ, తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు అభిమానులను నిరాశకు గురిచేసింది. అంగళ్లు, ఏపీ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులలో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఈ మూడు కేసులకు సంబంధించి వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జస్టిస్ కే సురేష్ రెడ్డి డిస్మిస్ చేశారు. మరోవైపు, ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు బెయిల్, రిమాండ్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో, ఏసీబీ కోర్టులోనైనా చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇస్తుందా లేక సీఐడీ కస్టడీకి ఇస్తుందా అన్న ఉత్కంఠ ఏర్పడింది. వాస్తవానికి అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందని అంతా అనుకున్నారు. ఈ కేసులో నిందితులందరికీ ఆల్రెడీ బెయిల్ వచ్చింది.
This post was last modified on October 9, 2023 11:59 am
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…