వైద్యుడిగా సుపరిచితుడు.. ఏపీలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యజమానుల్లో ఒకరుగా పేరున్న డాక్టర్ రమేశ్ పై ఏపీ సర్కారు చర్యల్ని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో పది మంది మరణించటం.. దాదాపు ఇరవై మందికి పైగా గాయాలు పాలు కావటం తలెిసిందే. ఈ నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రిపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వర్ణ ప్యాలెస్ ను లీజుకు తీసుకున్న రమేశ్ ఆసుపత్రి.. అక్కడ కొవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.
అయితే.. అక్కడి నిర్వహణ లోపాల కారణంతో పాటు.. నిబంధనలను పట్టించుకోని కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్వహణ లోపం కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రి ఎండీ రమేశ్ బాబుతో సహా పలువురుపైన కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ రమేశ్ బాబుతో సహా పలువురిపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఏళ్ల తరబడి స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. అధికారులు కోవిడ్ కేర్ కు అనుమతులు ఇచ్చారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ఏపీ హైకోర్టు.. అనుమతులు ఇచ్చిన అధికారులు కూడా ప్రమాదానికి బాధ్యులే కదా? అని వ్యాఖ్యానించింది.
దీంతో.. కలుగజేసుకున్న ప్రభుత్వం తరఫు న్యాయవాది.. కేసు విచారణ దశలో ఉందన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. డాక్టర్రమేశ్ బాబుతో పాటు సీతారమ్మోహన్ రావుపై తదుపరి చర్యల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి రాస్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. రమేశ్ ఆసుపత్రిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలన్న ఏపీ అధికారుల ప్రయత్నాలకు బ్రేకులు పడినట్లుగా చెప్పక తప్పదు.
This post was last modified on August 25, 2020 7:05 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…