తెలంగాణాలో బీఆర్ఎస్ అభ్యర్ధులందరికీ కేసీయార్ మాత్రమే కావాలి. తమ నియోజకవర్గాల్లో కేసీయార్ ప్రచారం చేస్తేనే ఉపయోగం ఉంటుందని అభ్యర్ధులందరు కోరుకుంటున్నారు. తమ నియోజకవర్గాల్లో కచ్చితంగా ప్రచారం చేయాల్సిందేనని కేసీయార్ కు అందరు రిక్వెస్టులు పెడుతున్నారట. ముందుగా చెబితే బహిరంగసభలు, రోడ్డుషోలకు ఏర్పాట్లు చేసుకుంటామని అడుగుతున్నట్లు సమాచారం. దీనంతటికి కారణం ఏమిటంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా తమకు కూడా గ్రాఫ్ తగ్గిపోయిందని మంత్రులు, ఎంఎల్ఏలు భావిస్తుండటమే.
విచిత్రం ఏమిటంటే గడచిన తొమ్మిదేళ్ళుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా కేసీయార్ వస్తేనే ఉపయోగముంటుందని అనుకోవటం. అంట మంత్రులు, ఎంఎల్ఏలుగా సుదీర్ఘంగా పనిచేసిన వాళ్ళకు కూడా జనాల్లో పట్టులేదని అర్ధమైపోతోంది. వీళ్ళల్లో ఇంతగా టెన్షన్ పెరిగిపోతుండటానికి ప్రధాన కారణం ఏమిటంట కాంగ్రెస్ కు గ్రాఫ్ పెరుగుతుండటమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగిపోతోంది. ఈ పబ్లిసిటీయే బీఆర్ఎస్ లో బాగా టెన్షన్ పెంచేస్తోంది.
రెండునెలల ముందే అభ్యర్ధులను ప్రకటించినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఎందుకంటే జనాల్లో బాగా వ్యతిరేకతను మూటగట్టుకున్న మంత్రులు, ఎంఎల్ఏలకే కేసీయార్ మళ్ళీ టికెట్ల ఇవ్వటమే. దీనివల్ల ఏమైందంటే ముదు పార్టీ నేతలు, క్యాడర్లోనే చాలామంది సిట్టింగులపై తీవ్రస్ధాయిలో వ్యతిరేకత ఉంది. దానికితోడు జనాలు కూడా బాగా విసిగిపోయున్నారు. ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని ఎంతమంది మొత్తుకున్నా కేసీయార్ మళ్ళీ వాళ్ళకే టికెట్లిచ్చారు. ఇపుడు అదే పెద్ద సమస్యగా మారిపోయింది.
This post was last modified on October 8, 2023 1:59 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…