Political News

నిందితుల జాబితాలో ఆప్ ?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా ? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాజకీయాల్లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే. స్కామ్ లో చేతులుమారిన మొత్తం తక్కువే అయినప్పటికీ ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల కారణంగా స్కామ్ సంచలనంగా మారింది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడైన మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు.

అలాగే మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా జైలులోనే ఉన్నారు. వీళ్ళిద్దరే కాకుండా తాజాగా ఒక ఎంపీ సంజయ్ సింగ్ ను కూడా జైల్లోకి తోశారు. ఇదే కేసులో అరెస్టయిన మరో ఐదుగురు అప్రూవర్లుగా మారిపోయారు. అంటే జరుగుతున్న దాన్ని చూస్తుంటే లిక్కర్ స్కామ్ లో ఈడీ టార్గెట్ మొత్తం ఆప్ మాత్రమే అన్నది అర్ధమైపోతోంది. ఈ నేపధ్యంలోనే స్కామ్ నిందితుల జాబితాలో ఆప్ పార్టీని కూడా చేర్చేందుకు ఈడీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

నిందితుల జాబితాలో ఆప్ ను చేర్చే విషయమై ఈడీ న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన విచారణలో స్కామ్ లో లబ్దిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని స్వయంగా అత్యున్నత న్యాయస్ధానమే ఈడీని నిలదీసింది. లిక్కర్ స్కామ్ మొత్తాన్ని గమనిస్తే ఒక రాజకీయపార్టీలోని వాళ్ళకే లబ్ది జరిగినట్లు అర్ధమవుతోందని కోర్టు అభిప్రాయపడింది. అలాంటపుడు ఆ పార్టీని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది.

కోర్టే స్వయంగా ప్రశ్నించింది కాబట్టి సమాధానం చెప్పడానికి రెండు రోజుల సమయం కావాలని ఈడీ లాయర్ అడిగారు. సో, జరుగుతున్నది చూస్తుంటే తొందరలోనే లిక్కర్ స్కామ్ నిందితుల జాబితాలో ఆప్ ను కూడా చేర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే కోర్టు ఆదేశాల ఆధారంగా ఆప్ పై ఈడీ కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసే అవకాశముంది. అప్పుడు ఎన్నికల కమీషన్ ఆప్ గుర్తింపును రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on October 6, 2023 10:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago