నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో తొందరలోనే తెలంగాణాలో రోడ్డు షోలు మొదలవ్వబోతున్నాయా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం తేవడంలో భాగంగా పార్టీ యాక్టివిటీస్ ను పెంచాలని గతంలో చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహణతో పాటు ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం, నల్గొండ, నిజామాబాద్ లో సభలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అలాగే కుకట్ పల్లిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు.
ఇవన్నీ అవ్వగానే తెలంగాణ మొత్తంలో చంద్రబాబు ఆధ్వర్యంలోనే బస్సు యాత్రలు చేయాలని కూడా పార్టీ డిసైడ్ చేసింది. అయితే ఊహించని విధంగా స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దాంతో చంద్రబాబు షెడ్యూల్ మొత్తం తల్లకిందులైపోయింది. మరిపుడు ఏమి చేయాలి ? అన్నదే తెలంగాణా పార్టీ ముందున్న పెద్ద ప్రశ్న. అందుకనే చంద్రబాబు స్థానంలో బాలయ్యను రోడ్డుషోల్లో తిప్పాలని అనుకుంటున్నట్లు సమాచారం.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే బాలకృష్ణ నాయకత్వంలో పార్టీలోని నేతలంతా బస్సుయాత్రకు రెడీ అవుతున్నారట. ఇందుకు సంబంధించిన రూటుమ్యాప్ కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. మూడురోజుల క్రితమే తెలంగాణా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రాష్ట్ర కార్యవర్గంలోని ముఖ్యనేతలతో బాలయ్య సమావేశమైన విషయం తెలిసిందే. అప్పుడే చంద్రబాబు బస్సుయాత్ర విషయాన్ని నేతలు బాలయ్య దగ్గర ప్రస్తావించారట. అప్పుడు బాలయ్య మాట్లాడుతూ బస్సు యాత్ర లో పాల్గొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారట. తొందరలోనే తెలంగాణా ఎన్నికలు రాబోతున్నాయి.
ఎన్నికలకు ఇప్పటి నుండే సిద్ధం కాకపోతే చాలా ఇబ్బందులు ఎదురవ్వటం ఖాయమని పార్టీ అభిప్రాయపడింది. అందుకనే ముందుగా బస్సుయాత్రకు రూటుమ్యాప్ ను సిద్ధం చేస్తున్నది. బస్సుయాత్రకు రెడీ అవుతారు బాగానే ఉంది కానీ మరి అభ్యర్ధుల ఎంపికను ఎవరు చూస్తారు ? వారి తరపున ప్రచార బాధ్యతలు ఎవరు తీసుకుంటారు ? నిధుల పంపిణీ అన్నది కూడా చాలా కీలకమైందే. మరి వీటన్నింటికీ పార్టీ తరపున ఇప్పటికిప్పుడు సమాదానాలైతే దొరకటంలేదు. ఓ నాలుగురోజులు పోతే అన్నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో చూడాలి.
This post was last modified on October 6, 2023 10:33 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…