Political News

ఎన్డీఏలోనే ఉన్నాం: పవన్

ఎన్టీఏకు ఒక అడుగు దూరం జరిగానని పెడన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలను ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్డీఏతో పవన్ తెగదెంపులు చేసుకున్నట్లేనని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కైకలూరు లోని ముదినేపల్లి లో జరిగిన బహిరంగ సభలో ఎన్డీఏలో జనసేన పొత్తు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీఏ కూటమి నుంచి జనసేన బయటకు వచ్చేసిందని కొందరు సలహాదారులు తన వీడియోలు చూపించి మరీ విమర్శిస్తున్నారని పరోక్షంగా సజ్జలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. తాము ఎన్డీఏలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి..వైసీపీకి సమస్య ఏంటి అని పవన్ ప్రశ్నించారు. 151 సీట్లు ఉండి కూడా జనసేనను చూసి వైసీపీ భయపడుతోందంటే ఓటమి భయం పట్టుకున్నట్లేనని పవన్ వ్యాఖ్యానించారు. తనకే 151 సీట్లు ఉంటే ప్రతిపక్షాలను అసలు పట్టించుకోనని చెప్పారు. ఎన్డీఏ నుంచి బయటకు రావాలనుకుంటే ఆ విషయం తానే ప్రకటిస్తానని పవన్ అన్నారు. మేము బయటకు వచ్చామని వైసీపీ నేతలు చెబితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్డీఏతో జనసేన కలిసి ఉందని సభాముఖంగా పవన్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా అంటే గౌరవం ఉందని, రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి ముందుకు వెళ్తామని తాను అనుకుంటున్నానని పవన్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలిచి జనసేనకు కేంద్రం మద్దతు లేకపోతే నీ అంతు చూస్తాం అని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని పవన్ ఆరోపించారు, వైఎస్ ను తాను ఎదుర్కొన్నానని, జగన్ ఉడత ఊపులకు భయపడే వాడిని కాదని చెప్పారు. 2014లో వైసీపీ ఓడిపోయిన తర్వాత తన ఆఫీసు దగ్గరకు వైసీపీ రౌడీలు వచ్చారని, ఒకవేళ కేంద్రంలో బీజేపీ… ఏపీలో టీడీపీ 2014లో ఓడిపోయి ఉంటే తన పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఉండదని, రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని పవన్ ధీమా వ్యక్తం చేశారు.

This post was last modified on October 5, 2023 10:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యూరిక్ యాసిడ్ సమస్యలకు జీలకర్రతో ఇలా చెక్ పెట్టండి..

ప్రస్తుతం మనలో చాలామంది తెలిసో తెలియకో ఇబ్బంది పడే సమస్యలలో యూరిక్ యాసిడ్ పెరుగుదల కూడా ఒకటి. చలికాలంలో ఈ…

49 minutes ago

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

9 hours ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

10 hours ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

11 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

12 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

13 hours ago