ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు దాదాపు 6-8 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడచిన 24 గంటల్లో ఏపీలో మరో 8,601 పాజిటివ్ కేసులు నమోదు కాగా….మొత్తం కేసుల సంఖ్య 3,61,712కి చేరింది. గత 24 గంటల్లో 86 మంది మరణించగా…కరోనాతో ఇప్పటివరకు 3,368 మంది మరణించారు.
ఇక, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. గడచిన 24 గంటల్లో 1441 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 50,686కు చేరుకుంది. ఈ ఒక్క జిల్లాలోనే 50 వేలకు పైగా కేసులు నమోదు కాగా…కరోనా బారిన పడి 335 మంది మరణించడంతో ఆ జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు.
అయితే, దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య 50 వేలకు లోపే ఉన్నప్పటికీ…ఏపీలోని ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 50 వేలకు పైగా కేసులు నమోదవడం కలవరపెడుతోంది. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఛత్తీస్ గఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, ఝార్ఖండ్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలి-డమన్ అండ్ డయ్యూ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటలేదు. వీటిలో చాలా రాష్ట్రాలలో కేసుల సంఖ్య 10వేలకు లోపే ఉండడం విశేషం.
అయితే, తూ.గో జిల్లాలో కరోనా కేసుల తీవ్రతకు ప్రజల నిర్లక్ష్యం కారణమా…లేక ప్రభుత్వ వైఫల్యమా అన్నదానిపై చర్చ జరుగుతోంది. తూ.గో జిల్లాతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కేసుల సంఖ్య 30వేలకు పైగా నమోదు కావడం కూడా కలవరపెడుతోంది.
రాష్ట్రాలనే కాదు, అనేక దేశాలను తూగో జిల్లా దాటేసింది… మనందరికీ బాగా తెలిసిన ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రియా, అల్జీరియా, యెమెన్, మలేషియా వంటి అనేక ప్రముఖ దేశాలతో పాటు వంద దేశాల కంటే కూడా తూర్పుగోదావరి జిల్లా కరోనా కేసుల్లో ముందంజలో ఉంది.
This post was last modified on August 25, 2020 9:05 am
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…