అంగళ్లు అల్లర్ల కేసులో సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు…హైకోర్టు తీర్పును సమర్థించింది. ఆ బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమని, హైకోర్టు తీర్పును కొనసాగించాలని తేల్చి చెప్పింది. అయితే, ఈ కేసులో ఒక పోలీసు అధికారి గాయపడ్డారని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కానీ, ఆ వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. ఈ దశలో ఈ కేసు విచారణలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం చెప్పింది.
దీంతో, అంగళ్లు కేసులో దేవినేని ఉమా, చల్లా బాబు, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలతో సహా దాదాపు 41 మందికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ కొనసాగనుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇక, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై కూడా ఈ రోజు ఇదే బెంచ్ విచారణ జరపనుంది. మరోవైపు, అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. నారాయణ ముందస్తు బెయిల్ ను హైకోర్టు మరో 2 వారాల పాటు పొడిగించింది.
నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్ యజమాని బాబి, నారాయణ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ 2 వారాల పాటు ముందస్తు బెయిల్ ను కోర్టు పొడిగించింది.
This post was last modified on October 3, 2023 3:02 pm
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…