ఏపీ సీఐడీ పోలీసులు.. టీడీపీ యువనాయకుడు, మాజీమంత్రి నారా లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న సీఐడీ పోలీసులు నారా లోకేష్ కోసం వెతికిన విషయం తెలిసిందే. ఆయన ఎక్కడున్నారనే విషయంపై ఆరా తీశారు. అయితే, నారా లోకేష్ ఎక్కడ ఉన్నారనేది టీడీపీ బయటపెట్టలేదు.
ఈ క్రమంలో అశోకా రోడ్డు 50 లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేష్ ఉన్నట్టుగా తెలుసుకున్న సీఐడీ పోలీసులు.. ఆ కార్యాలయంలోకి వెళ్లి లోకేష్ కి 41 ఏ నోటిసులు అందించారు. దీనికి ముందు వాట్సాప్ ద్వారా కూడా నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర హైకోర్టుకు కూడా సీఐడీ అధికారులు సమాచారం అందించారు.
నారా లోకేష్ ఉనికి తమకు తెలియనందున ఆయన ఫోన్ వాట్సాప్‌కు నోటీసులను పంపించామని పేర్కొన్నారు. అయితే, తర్వాత గల్లా కార్యాలయంలో నారా లోకేష్ ఉన్న విషయాన్ని తెలుసుకుని అక్కడకు చేరుకుని నోటీసులు అందించారు. ఇక, నారా లోకేష్ కూడా తనకు అందిన నోటీసులపై స్పందించారు. నోటిసులు అందుకున్నానని పేర్కొన్నారు. సిఐడి అధికారుల నుంచి స్వయంగా నోటీసులు అందుకున్నారు.
అక్టోబర్ 4 న ఉదయం 10 గంటలకు సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నట్టు నారా లోకేష్ పేర్కొన్నారు. ఆ రోజు తప్పకుండా విచారణకు వచ్చే ప్రయత్నం చేస్తానని ఆయన రిప్లయి సమాధానంలో తెలిపారు.
This post was last modified on September 30, 2023 7:18 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…