అసలే ఎన్నికల సమయం కావడం… సెటిలర్ల ఓట్లు, అదేసమయంలో టీడీపీ అభిమానుల ఓట్లు కూడా కలవర పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి, పొలిటికల్ హాట్ కామెంట్లు పేల్చే యువ నాయకుడు కేటీఆర్ సీనియర్ ఎన్టీఆర్ సెంట్రిక్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. “మాకు రాముడైనా.. కృష్ణుడైనా సీనియర్ ఎన్టీఆర్ ఒక్కరే!!” అని కేటీఆర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
అంతేకాదు.. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. వారందరి ఆరాధ్య దైవం ఎన్టీఆరేనని కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్ బండ్‌పై రూ.1.37 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ పార్క్ సహా విగ్రహాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు.
“విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు… ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు. అప్పటి శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. భారత దేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది కూడా ఎన్టీఆరేనని చెప్పారు.
చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుందన్న కేటీఆర్ .. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తనకు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తారక రామారావు పేరులోనే పవర్ ఉందని, ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారని పేర్కొన్నారు. మొత్తంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు.. ఎన్నికల నేపథ్యంలో అటు సెటిలర్లు, ఇటు టీడీపీ అభిమానులను ఆకర్షించేవిగా ఉన్నాయనే గుసగుస వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on September 30, 2023 3:15 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…