కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రకటించారు. శ్రీధర్ కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటికి ఛైర్మన్ గా ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం పార్టీ ఆఫీస్ గాంధీభవన్లో మేనిఫెస్టో కమిటీ నేతలు సమావేశమై అనేక అంశాలను చర్చించారు. ఇందులో స్టూడెంట్స్ అందరికీ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్న అంశం కీలకమైంది. స్టూడెంట్స్ కే కాదు స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ ఉద్యోగులకు కూడా ఇంటర్నెట్ విషయంలో ప్రత్యేక పాలసీలను తీసుకురావాలని అనుకుంటున్నట్లు శ్రీధర్ చెప్పారు.
వీళ్ళకే కాకుండా ఉబెర్, ఓలా, ఆటో డ్రైవర్లకు కూడా ప్రత్యేక స్కీములను తీసుకొచ్చే విషయమై కసరత్తు జరుగుతోందన్నారు. సడెన్ గా కాంగ్రెస్ పార్టీ ఫ్రీ ఇంటర్నెట్, పాలసీల పేరుతో విద్యార్దులు, డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్స్ మీద ఎందుకు దృష్టిపెట్టింది. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పై వర్గాల సంఖ్య కోట్లలో ఉంటుంది. విద్యార్దులే తక్కువలో తక్కువ కోటిమంది దాకా ఉంటారు. ఇపుడు చిన్న పిల్లల దగ్గర నుండి పోస్టు గ్రాడ్యుయేట్ చదివే విద్యార్థుల వరకు ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడేస్తున్నారు.
ఒకవైపు ఇంటర్నెట్ ప్లాన్లు చాలావరకు చీపుగానే అందిస్తున్నారు మొబైల్ ఆపరేటర్లు. అయినా రెగ్యులర్ గా ఎంతో కొంత డబ్బులు చెల్లించి రీచార్జిలు చేసుకోవాల్సిందే. ఈ నేపధ్యంలోనే విద్యార్ధులకు మొత్తం ఇంటర్నెట్ ఫ్రీ అని కాంగ్రెస్ చెబితే విద్యార్దులు, నిరుద్యోగులంతా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతారని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లున్నారు.
ఇక ఆటో డ్రైవర్లు, ఓలా, ఉబెర్, రాపిడో సర్వీసులో పనిచేస్తున్న డ్రైవర్లు లక్షల్లో ఉంటారు. వీళ్ళకి కూడా 24 గంటలూ ఇంటర్నెట్ చాలా అవసరమే ఉంటుంది. వీళ్ళు కూడా రెగ్యులర్ గా ఇంటర్నెట్ ను రీచార్జి చేసుకుంటునే ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఫ్రీ కాకపోయినా అలాంటిదే ఏదో పాలసీ ప్రకటిస్తే వీళ్ళ ఓట్లు కూడా కాంగ్రెస్ కే పడతాయన్నది పార్టీ పెద్దల ఆలోచన. మొత్తానికి ఎన్నికల్లో గెలుపుకోసం అన్నీ పార్టీలు ఫ్రీ మంత్రాన్నే జపిస్తున్నాయి.
This post was last modified on September 30, 2023 10:41 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…