రాబోయే ఎన్నికల్లో గెలుపు సాధించడం ఎలాగ అన్నది మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముందున్న సవాల్. అధికారం అందుకోవడం కోసం వీలైనన్ని పథకాలు, హామీలు, డిక్లరేషన్లను పార్టీల అధినేతలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలతో పోల్చితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేమిటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమల్లోకి తెచ్చేసే సౌలభ్యం ఉంది. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే పద్దతిలో కనీసం ఎన్నికలవరకు అయినా అమలు చేస్తారు.
ఇందులో భాగంగానే తొందరలోనే అర్హులైన పేదలందరికీ హెల్త్ కార్డులను ప్రవేశపెడితే ఎలాగుంటుందనే ఆలోచన చేస్తున్నారట. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ మేలు కలయికగా కొత్తగా హెల్త్ కార్డులను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళంతా అర్హులనే ప్రకటన తొందరలోనే చేయబోతున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం అర్హులైన వైట్ రేషన్ కార్డులున్న వాళ్ళు 90 లక్షల కుటుంబాలు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీలైనంత తొందరలో అంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే హెల్త్ కార్డు పథకాన్ని ప్రకటిస్తే బాగుంటుందని కేసీయార్ ఆలోచిస్తున్నారు. 90 లక్షల కుటుంబాలు అర్హులంటే కుటుంబానికి ముగ్గురిని వేసుకున్నా సుమారు 2.7 కోట్లమంది జనాలు కవర్ అవుతారు. ఇందులో 2 కోట్లమంది ఓటర్లుగా ఉంటారని అంచనా. ఈ ఓటర్లలో కూడా తక్కువలో తక్కువ 1 కోటి మంది బీఆర్ఎస్ కు ఓట్లేసినా చాలు మళ్ళీ అధికారంలోకి వచ్చేయటం ఖాయమని బీఆర్ఎస్ నేతలు చాలా అంచనాలు వేసుకుంటున్నారు.
హెల్త్ కార్డుకు అదనంగా ఇప్పటికే ప్రభుత్వం రైతు రుణమాఫీ, బీసీ బంధు, దళితబంధు, గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. కాబట్టి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాబోయే ఎన్నికల్లో ఈజీగా గెలిచిపోవచ్చన్నది కేసీయార్ అంచనా. కేసీయార్ ఆలోచనలను కాంగ్రెస్, బీజేపీలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on September 29, 2023 10:13 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…