కాంగ్రెస్ లో బీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు అలా చేరారో లేదో ఇలా లొల్లి మొదలైపోయింది. మైనంపల్లి కేంద్రంగా సీనియర్లు అధిష్టానం ముందు గొడవ మొదలు పెట్టేశారు. దేనికంటే తమకు కూడా డబుల్ టికెట్లు ఇవ్వాల్సిందే అని. రాబోయే ఎన్నికల్లో తెలంగాణా మొత్తం మీద ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని మొదట్లోనే అధిష్టానం స్పష్టంగా చెప్పింది. అయితే పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మాత్రం మినహాయింపు ఇచ్చింది.
ఎందుకంటే ఉత్తమ్ దంపతులు ఎప్పటినుండో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి. ఈ విషయమై అధిష్టానం గట్టిగా ఉండటంతో సీనియర్లు ఏమీ మాట్లాడలేకపోయారు. అయితే బీఆర్ఎస్ నుండి కొత్తగా కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లికి కూడా అధిష్టానం మినహాయింపు ఇచ్చింది. మల్కాజ్ గిరి నుండి మైనపంల్లికి, మెదక్ నుండి కొడుకు రోహిత్ రావుకు టికెట్లు ఖాయం చేసింది. దాంతో చాలామంది సీనియర్లకు మండిపోయింది. దశాబ్దాల పాటు పార్టీలో పనిచేస్తున్న తమ కుటుంబాలకు రెండో టికెట్ ఇవ్వడానికి ఇష్టపడని అధిష్టానం కొత్తగా చేరిన హనుమంతరావుకు మాత్రం మినహాయింపు ఇవ్వడం ఏమిటని గోలచేస్తున్నారు.
మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు రావటంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెరవెనుక చక్రం తిప్పారని సీనియర్లు బాగా గుర్రుగా ఉన్నారు. తమ కుటుంబాల్లో రెండు టికెట్లు ఇవ్వాల్సిందే అని దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, కొండా సురేఖ, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి తదితరులు ఎప్పటినుండో పట్టుబడుతున్నారు.
అయితే మైనంపల్లి కేసు సపరేటు కేసుగా అధిష్టానం చూసిందట. ఎందుకంటే మల్కాజ్ గిరిలో తాను గెలవటమే కాకుండా మెదక్, మేడ్చల్ నియోజకవర్గాలను కూడా తాను గెలిపిస్తానని మైనంపల్లి పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చారట. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలీదు కానీ మైనంపల్లి ప్రభావం మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఉంటుందన్నది వాస్తవమే. ఆర్ధిక, అంగ బలం అపారంగా ఉన్న మైనంపల్లికి నాలుగు నియోజకవర్గాల్లో బలమైన మద్దతుదారులున్నారు. ఈ కారణంగానే చివరి నిముషం వరకు మైనంపల్లి పార్టీ మారకుండా కేసీయార్ ప్రయత్నించారు. మరి మైనంపల్లి తన హామీని ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాల్సిందే.
This post was last modified on September 29, 2023 10:12 am
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…