కో.. కోటి! అని తెలుగులో ఓ పాట ఉంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలోనూ.. ఇదే పాట వినిపి స్తోంది. అత్యంత కీలకమైన కూకట్‌పల్లి టికెట్ కోట్ల రూపాయలు పలుకుతున్నట్టు దాదాపు అన్ని పార్టీల్లో నూ చర్చ సాగుతోంది. కూకట్‌పల్లి టికెట్‌ను కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. పైగా..ఈ టికెట్ కోసం కోట్ల రూపాయలు పార్టీలకు ఫండ్‌గా ఇచ్చేందుకు కూడా కొందరు పారిశ్రామిక వేత్తలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
గత 2018 ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ ఇక్కడ విజయం దక్కించుకుంది. ఈ పార్టీ తరఫున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు 41 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కారు. దీనికి ముందు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇదే కృష్ణారావు టీడీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసి 43 వేల పైచిలుకు ఓట్లతో విజయం దక్కించుకున్నారు. ఇక, 2018లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో చేతులు కలిపిన నేపథ్యంలో ఈ టికెట్‌ను టీడీపీ తరఫున నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కేటాయించారు.
గట్టి పోటీ ఇచ్చినా.. నందమూరి బాలకృష్ణ వంటివారు ప్రచారం చేసినా.. సుహాసిని గెలుపు గుర్రం ఎక్కలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి తెలంగాణ ఎన్నికల ముంగిట కూకట్‌పల్లి టికెట్ కోసం.. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీలోనే ఓ కీలక నాయకుడు ఈ టికెట్ తనకు ఇవ్వాలని.. మాధవరంను ఓడించి తీరుతానని.. పార్టీని గెలిపించే బాధ్యత తనమీద వేసుకుంటానని చెబుతున్నారట.
ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి ద్వారా.. ఈ టికెట్ కోసం ఒక కీలక పారిశ్రామిక వేత్త ప్రయత్నాలు చేస్తున్నట్టు కూకట్‌పల్లి నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తున్న మాట. రెండు కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్‌గా ఇచ్చేందుకు, అదేసమయంలో మరో రెండు మూడు నియోజక వర్గాలకు డబ్బు సమకూర్చేందుకు కూడా సదరు పారిశ్రామిక వేత్త రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పార్టీ అధిష్టానం వద్దే చర్చ జరగనుందని.. అంటున్నారు.
మరోవైపు బీఆర్ ఎస్ తరఫున మాధవరం పోటీ చేసినా.. ఈ సారి ఆయన గ్రాఫ్ తగ్గిందనే అంచనాలు వస్తుండడం.. వరుస విజయాలు సాధించినా.. తమను పట్టించుకోలేదని.. మాధవరంపై ఇక్కడి ప్రజలు పెదవి విరవడం వంటి అంశాలు.. ఇతర పార్టీల్లో ఈ టికెట్ ను హాట్ టాపిక్‌గా మార్చాయి. ఇక్కడ దాదాపు అందరూ కూడా ఏపీ నుంచి వచ్చిన సెటిలర్లే ఉండడం కూడా నాయకులను ఊరిస్తోంది.
This post was last modified on September 28, 2023 1:41 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…