Political News

సెటిల‌ర్ల ఓట్లు ఈ సారి అక్క‌ర్లేదా? : బీఆర్ఎస్‌లో గుస‌గుస‌

పైకి ఎంత గంభీర వ‌చ‌నాలు చెప్పినా.. ఎన్నిక‌ల స‌మ‌యానికి సెటిల‌ర్ల ఓట్లు.. తెలంగాణ పాల‌క ప‌క్షానికి కానీ, ప్ర‌తిప‌క్షాల‌కు కానీ అత్యంత కీల‌కం. ఎల్బీన‌గ‌ర్ నుంచి ఖైర‌తాబాద్‌, కూక‌ట్‌ప‌ల్లి స‌హా సుమారు 12 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో సెటిల‌ర్ల ఓట్లు నాయ‌కుల త‌ల‌రాత‌ల‌ను సెటిల్ చేస్తున్నాయి. ఈ విష‌యం తెలిసే.. అధికార బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌, బీజేపీ స‌హా వామ‌ప‌క్షాల వ‌ర‌కు సెటిల‌ర్ల‌పై ప‌న్నెత్తు మాట అనేందుకు సాహ‌సం చేసే ప‌రిస్థితి లేదు.

అయితే.. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు.. సెటిల‌ర్ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశాయ‌ని, సెటిల‌ర్లు ఈ సారి త‌మ‌వైపు నిలుస్తార‌ని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు.. చ‌ర్చ‌కు దారితీశాయి. ఏపీలో జ‌రిగిన చంద్ర‌బాబు అరెస్టు, జైలు వంటి ప‌రిణామాల ద‌రిమిలా.. కొంత గ్యాప్‌తో సెటిల‌ర్లు చైత‌న్యం అయ్యారు. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఐటీ రంగం కూడా ఉద్య‌మించింది. ఇక‌, సెటిల‌ర్లు కూడా.. చంద్ర‌బాబుకు అనుకూలంగా ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు.

సెటిల‌ర్ల మ‌నోభావాల‌ను గుర్తించిన ఎల్బీ న‌గ‌ర్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కూడా.. వీరితో చేతులు క‌లిపి.. చంద్ర‌బాబుకు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కూడా ధ‌ర్నాలో పాల్గొన్నారు. త‌ద్వారా.. సెటిల‌ర్ల ఓట్లు త‌న నుంచి జారిపోకుండా చూసుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, అనూహ్యంగా మంత్రి కేటీఆర్ మాత్రం త‌మ‌కు.. చంద్ర‌బాబు కేసుకు సంబంధం ఏంట‌ని, ఇక్క‌డ ఆందోళ‌న‌ల‌కు, నిర‌స‌న‌ల‌కు, ధ‌ర్నాల‌కు ఎలా అనుమ‌తులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.

అస‌లు ఏదైనా ఇలాంటి కార్య‌క్ర‌మాలు ఉంటే.. వెంట‌నే ఏపీకి వెళ్లి అక్క‌డ ధ‌ర్నాలు, రోకోలు చేసుకోవాల‌ని కేటీఆర్ ఉచిత స‌ల‌హా ఇచ్చారు. ఇది స‌హ‌జంగానే ఐటీ ఉద్యోగుల‌కు, సెటిల‌ర్లుగా ఉన్న పారిశ్రామిక వేత్త‌లు.. ఇత‌ర వ‌ర్గాల‌కు కూడా..ఒకింత ఇబ్బందిగానే తోచింది. ప్రస్తుత లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణ ఓటు బ్యాంకులో సెటిల‌ర్ల‌ది 5 శాతం పైగా ఉంద‌ని అంటున్నారు.

సో.. వీరు ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో బీఆర్ ఎస్‌కు దూర‌మ‌వుతార‌ని.. ఇది త‌మ‌కు లాభిస్తుంద‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే నిన్న మొన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు విష‌యంలో సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గ‌ళం గ‌ట్టిగానే వినిపించారు. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా మాట్లాడారు. ఇది కాంగ్రెస్ అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపించినా.. సెటిల‌ర్లు మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూప‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాతో రేవంత్ ఇలా వ్య‌వ‌హ‌రించి ఉంటార‌ని అంటున్నారు.

This post was last modified on September 28, 2023 11:57 am

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

1 hour ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

3 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

11 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago