నిజమే. ఇప్పడు తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవహారంపై సీనియర్ల నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ముఖ్యంగా ఆయనను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న వీ. హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వంటి చాలా మంది పేరున్న నాయకులు రేవంత్‌పై అంతర్గత సంభాషణల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఆదిపత్యం పెరిగిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.
సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అనేది అధిష్టానం చూస్తుంది. రాష్ట్ర స్థాయిలో నాయకులు ఒక జాబితా రెడీ చేసుకుని కేంద్ర అధిష్టానానికి పంపిన తర్వాత.. జాబితాలోని పేర్లను పరిశీలించి, వారి ఆటో బయోగ్రఫీని ఆమూలాగ్రం అధ్యయనం చేసిన తర్వాత.. టికెట్లను కన్ఫర్మ్ చేయడం అనేది కాంగ్రెస్‌లో సంప్రదాయంగా వస్తోంది. అయితే, ఈవిషయంలో రేవంత్ కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తానే స్వయంగా కొందరికి టికెట్లు ప్రకటిస్తున్నారు.
ముఖ్యంగా ఒకే కుటుంబంలోని వారికి రెండేసి టికెట్లు ఇచ్చేందుకు కూడా తాము సిద్ధమనే విధంగా రేవంత్ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సీనియర్లకు సరిపడడం లేదు. కనీసం తమతో కూడా చర్చించ కుండానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్న విధానంపైనే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ దిరికార్డుగా మీడియా మిత్రుల వద్ద ఇదే కామెంట్లు చేస్తున్నారు. పార్టీలో టికెట్ల నిర్ణయం అనేది అత్యంత కీలకమైన వ్యవహారమని, దీనిని ఏ ఒక్కరో తీసుకునే పరిస్థితి లేదని వారు చెబుతున్నారు.
అదేసమయంలో టీడీపీ వ్యవహారంపైనా రేవంత్ స్పందించిన తీరును కూడా సీనియర్లు తప్పుబడుతున్నారు. ఇప్పటి వరకు సంయమనంతో వ్యవహరించిన రేవంత్ ఇప్పుడు.. అనూహ్యంగా టీడీపీకి మద్దతుగా మాట్లాడడం.. చంద్రబాబు అరెస్టు వంటి అంశాలను స్పృశించడం ద్వారా.. బీఆర్ఎస్ పార్టీకి అనవసరపు ఆయుధాలను అందించినట్టు అవుతుందని వారు చెబుతున్నారు. ఈ పరిణామాల విషయంలో అధిష్టాన్యం జోక్యం కోరుతున్న వారు పెరుగుతుండడం గమనార్హం. అయితే, ఇదే విషయంలో రేవంత్‌ను సమర్థిస్తున్న వారు కూడా ఉన్నారు. మరి ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాల్సి ఉంది.
This post was last modified on September 28, 2023 9:49 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…