అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరును ఏ 14గా పేర్కొంటూ సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సిఐడి తాజాగా లోకేష్ ను ఏ14 గా పేర్కొనడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తన యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభం కాబోతోందన్న భయంతోనే జగన్ ఈ కేసులో తన పేరు చేర్పించారని లోకేష్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
ఈ కేసులో లోకేష్ ను14వ ముద్దాయిగా సిఐడి చేర్చడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ కేసులో లోకేష్ పాత్ర ఉందనే సీఐడీకి తాను ఫిర్యాదు చేశానని ఆర్కే అన్నారు. టిడిపికి అనుకూలమైన వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా మార్పులు చేర్పులు చేశారని ఆరోపించారు. చట్టాలను గౌరవిస్తానని చెప్పే చంద్రబాబు, లోకేష్ ఈ కేసులకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేదని, స్కామ్ ఎలా జరిగిందని లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. రోడ్డు వేయకముందే అలైన్మెంట్ పేరుతో దోచుకున్నారని ఆరోపించారు.
అరెస్టు భయంతోనే లోకేష్ ఢిల్లీ వెళ్లి దాక్కున్నారని విమర్శించారు. ఎర్రబుక్కులో రాసుకుంటానంటూ అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని విమర్శించారు. ఎర్ర బుక్ సంగతి తర్వాత చూడొచ్చని, సిఐడి మెమోలో లోకేష్ పేరు చేర్చిన విషయం తెలుసుకోవాలని చురుకులంటించారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి అబద్ధాలు చెబుతున్నారని, వారి మాటలు వింటుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుందని రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు.
This post was last modified on September 27, 2023 2:51 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…