ఎన్నికలు మరో ఆరు మాసాల్లో ఉందనగా బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపిందా ? జరుగుతున్నది చూస్తుంటే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగిపోయిందన్నారు. మీడియాతో జీవీఎల్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కనీసం ఇప్పట్లో లేనట్లే అని ప్రకటించారు. ఇంతముఖ్యమైన నిర్ణయాన్ని ఒక మామూలు ఎంపీ ప్రకటించటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటీకరణ నుండి వెనక్కు తగ్గేదేలేదని కేంద్ర మంత్రులు పార్లమెంటులోనే ప్రకటించారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా వైజాగ్ లో ఫ్యాక్టరీ ఉద్యోగ, కార్మికులు, రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, జనాలు ఎన్ని ఆందోళనలు చేసినా తగ్గేదేలే అన్న సినిమా డైలాగును పదేపదే వినిపించారు. అలాంటిది ప్రైవేటీకరణ చేయబోవటంలేదన్న ముఖ్యమైన నిర్ణయాన్ని ఒక ఎంపీ ఎలా ప్రకటించగలరు ?
కాబట్టి జీవీఎల్ ప్రకటన ఉత్త రాజకీయ డ్రామాగా జనాలు అనుమానిస్తున్నారు. డ్రామా ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఈ రాజ్యసభ ఎంపీ లోక్ సభకు వైజాగ్ నుండే పోటీచేయాలని అనుకుంటున్నారు. ఇపుడు వాస్తవ పరిస్ధితి ఏమిటంటే అనేక కారణాలతో జనాలంతా నరేంద్రమోడీ ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకోవాలంటే ఏదో ఒక మాయచేయాల్సిందే. ఇప్పటికిప్పుడు జీవీఎల్ చేయగలిగిన మాయ ఏమీలేదు. అందుకనే జనాలందరికీ సెంటిమెంటుగా నిలిచిన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగటంలేదని ప్రకటించారు.
ఇదే ప్రకటనను స్వయంగా మోడీయే చేసినా జనాలు నమ్మరు. ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉండి మోడీ ఎన్ని అబద్ధాలు చెబుతున్నారో అందరు చూస్తున్నదే. రాష్ట్రప్రయోజనాలను పదేపదే తుంగలో తొక్కేస్తున్నారు. అలాంటిది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కేంద్రం ఆపేసిందని ఒక ఎంపీ చెబితే నమ్మేజనాలు ఎవరూ లేరు. అందుకనే ఇదంతా ఫక్తు ఎన్నికల డ్రామాగానే చూస్తున్నారు. ప్రైవేటీకరణ నుండి వెనక్కు తగ్గినట్లు, ఫ్యాక్టరీకి గనులను కేటాయిస్తున్నట్లు, అవసరమైన మూలధనాన్ని అందిస్తున్నట్లు కేంద్ర క్యాబినెట్ ప్రకటిస్తే అప్పుడు జనాలు నమ్ముతారేమో. లేకపోతే అప్పటివరకు జీవీఎల్ ది డ్రామానే అంటారంతా.
This post was last modified on September 27, 2023 12:17 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…