ఏదైనా ఊహించని పరిణామం ఎదురైతే షాక్ కు గురి కావడం సహజమే. ఇప్పుడు టీడీపీ కూడా అదే షాక్ లో ఉంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టును ఎవరూ ఊహించలేదు.
రాజకీయ నాయకులపై ఆరోపణలు రావడం సహజమే.. కానీ పోలీసులు రంగంలోకి దిగి నేరుగా అదుపులోకి తీసుకునే అవకాశం లేదని టీడీపీ అనుకుంది. అరెస్టయితే చేశారు కానీ కేసు నిలబడదని కూడా టీడీపీ శ్రేణులు ఆశించాయి. కానీ టీడీపీ అనుకున్నది ఒకటైతే జరుగుతోంది మరొకటి.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మొదటి నుంచి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొదట 14 రోజలు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు.. దీన్ని అక్టోబర్ 5 వరకు పెంచింది. మరోవైపు బాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇవన్నీ ఊహించని పరిణామాలే.
దీంతో బాబు ఇంకొంత కాలం జైల్లోనే ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో షాక్ నుంచి బయటకు వచ్చి యాక్షన్ ప్లాన్ పై టీడీపీ ఫోకస్ పెట్టింది. బాబు అరెస్టును జనాల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు కసరత్తులు ప్రారంభించింది.
బాబు అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు, పార్టీ వ్యవహారల నిర్వహణ, వీటి పర్యవేక్షణ కోసం 14 మంది సభ్యులతో ఓ పొలిటికల్ యాక్షన్ కమిటీని టీడీపీ ఏర్పాటు చేసింది. ఇందులో సీనియర్, కీలక నేతలు ఉన్నారు.
చంద్రబాబు ఆదేశాల మేరకే 14 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో యనమల రామక్రిష్ణుడు, అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బాలక్రిష్ణ, లోకేష్, పయ్యావుల కేశవ్, ఎంఏ షరీఫ్, నక్కా ఆనంద్ బాబు తదితరులున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టే కార్యక్రమాలతో పాటు నేతల్ని సమన్వయం చేసుకోవడం ఈ కమిటీ విధి. అంతే కాకుండా మద్దతుగా వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతరులతో ఈ కమిటీ సంప్రదింపులు జరుపుతుంది.
This post was last modified on September 25, 2023 5:12 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…