టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు ఐటీ ఉద్యోగులు చేపట్టిన కార్ల ర్యాలీతో వాతావరణం టెన్షన్గా మారింది. ఆదివారం తెల్లవారుజామునే హైదరాబాద్ నుంచి కార్లలో ఐటీ ఉద్యోగులు బయల్దేరారు. అయితే ఈ ర్యాలీ గురించి రెండు, మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఏపీ పోలీసులు దీనికి అనుమతి లేదని చెబుతున్నారు. అనుమతి లేనిదే ర్యాలీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరించారు. రోడ్డుపై వెళ్తున్న అన్ని కార్లను క్షుణ్నంగా పరీక్షిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని చెబుతున్న పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్ట్, జీలుగుమిల్లి, రాజుపేటతో పాటు మరోవైపు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, గోపాలపురం తదితర చోట్ల చెక్ పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేసి కార్లను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన కార్లను అనుమంచిపల్లి కోల్డ్ స్టోరేజ్ వద్ద ఆపేస్తున్నారు. ఐటీ ఉద్యోగులను అడ్డుకుంటున్నారు.
పోలీసులు ఐటీ ఉద్యోగులను అడ్డుకోవడంతో ఏపీకి వెళ్లే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి వెళ్లాలంటే వీసా కావాలా? అంటూ ఐటీ ఉద్యోగులతో పాటు నాయకులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది పాకిస్థాన్ బోర్డర్ కాదు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అంటూ.. ఐటీ ఉద్యోగులను అడ్డుకోవడం కోసం భారీ స్థాయిలో పోలీసులను మోహరించడాన్ని టీడీపీ ఎద్దేవా చేసింది. చంద్రబాబు అరెస్టు తర్వాత విజయవాడ వెళ్లేందుకు పవన్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాకు వెళ్లాలంటే వీసా, పాస్ పోర్టు కావాలా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఐటీ ఉద్యోగుల విషయంలోనూ పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఐటీ ఉద్యోగుల కార్లను పోలీసులు అడ్డుకోవడంతో ఏపీకి వెళ్లాలంటే వీసా కావాలా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
This post was last modified on September 24, 2023 2:54 pm
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం…
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…