రాష్ట్ర ప్రభుత్వంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో భారీ ఎత్తున మద్యం కుంభకోణం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఆమె లెక్కల ప్రకారం ఏడాదికి సుమారు రు. 36,750 కోట్లు అవినీతి జరుగుతోందట. విషయం ఏమిటంటే మద్యం ద్వారా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రు. 20 వేల కోట్లు వస్తోందట. అయితే వాస్తవంగా జరుగుతున్న అమ్మకాలు రూ. 56,750 కోట్లట.
రు. 56,750 కోట్ల అమ్మకాల్లో ప్రభుత్వానికి అందుతున్నది రు. 20 వేల కోట్లే అయితే మరి మిగిలిన రు. 36,750 కోట్లు ఎటు పోతున్నాయన్నది ఆమె ప్రశ్న. జవాబు కూడా ఆమే చెప్పేశారు. అన్ని వేల కోట్లరూపాయలు అధికారపార్టీ నేతల జేబుల్లోకి వెళుతున్నట్లుగా పురందేశ్వరి తేల్చేశారు. రు. 36,750 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, అందులో రు. 20 వేల కోట్లే ప్రభుత్వానికి అందుతున్నాయని ఆమెకు ఎవరు చెప్పారో తెలీదు. మిగిలిన రు. 36,750 కోట్లు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళుతున్నదని ఆమె దగ్గర ఉన్న సమాచారం, దానికి ఆధారం ఏమిటో కూడా తెలీదు.
మొత్తానికి వేల కోట్ల రూపాయలకు సరిపడా లెక్కలు చెప్పేశారు. అలా అవినీతి జరుగుతున్న వేల కోట్ల రూపాయల పైనే తాను తొందరలోనే సీబీఐని కలిసి ఫిర్యాదులు చేయబోతున్నట్లు చెప్పారు. ఇదే కాదు టిడ్కో ఇళ్ళ పథకంలో కూడా భారీ అవినీతి జరుగుతోందని పురందేశ్వరి పదేపదే ఆరోపిస్తున్నారు. ఇలాంటి అవినీతి చిట్టాను సేకరించి సీబీఐకి ఫిర్యాదులు చేయబోతున్నట్లు చెప్పారు.
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…