తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? పార్టీలో చీలిక రాబోతుందా? కీలక నేతలు ఆ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా ఏడెనిమిది మంది తెలంగాణ బీజేపీ కీలక నాయకులు ఓ నేత ఇంట్లో రహస్య భేటీ కావడం సంచలనంగా మారింది. ఈ నాయకులు బీజేపీని వీడే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయ శాంతి, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, సీనియర్ నేతలు గరికపాటి రామ్మోహన రావు తదితరులు హైదరాబాద్ లో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నట్లు తెలిసింది.
ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రేసులో బీజేపీ వెనుకబడింది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం దూరంలో ఆగిపోతోందనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పార్టీలోని కీలక నేతల రహస్య సమావేశం చర్చకు దారి తీసిందనే చెప్పాలి. పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని, తమను అధిష్ఠానం పట్టించుకోవడం లేదని ఈ నాయకులు అసంత్రుప్తి వ్యక్తం చేశారని తెలిసింది. అధిష్ఠానం తమను గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో పరిణామాలు, భవిష్యత్ పై ఈ నేతలు రహస్య భేటీలో చర్చించినట్లు తెలిసింది. విజయ శాంతి ఇప్పటికే బీజేపీకి దూరం దూరంగా ఉంటున్నారు. ఇటీవల సోనియా గాంధీ అంటే గౌరవం అంటూ రాములమ్మ ట్వీట్ చేశారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డికి కూడా పార్టీలో ఆశాజనక పరిస్థితులు కనిపించడం లేదని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో వీళ్లకు టికెట్లు వస్తాయి కానీ బీజేపీ తరపున గెలిచే పరిస్థితే లేదని ఈ నాయకులు అనుకుంటున్నారని సమాచారం. అందుకే బీజేపీ వదిలి కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు చూస్తున్నారని టాక్. ఇప్పటికే వివేక్ కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించారని, త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ నాయకులంగా కాంగ్రెస్లో చేరితే మాత్రం రాష్ట్రంలో బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందనే చెప్పాలి.
This post was last modified on September 20, 2023 3:22 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…