టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై పార్టీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజలను ఈ ఆందోళనల్లో భాగం చేయడంలో టీడీపీ నిమగ్నమైంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. బాబు అరెస్టును వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నాలను టీడీపీ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా పార్టీ సరైన మార్గంలోనే సాగుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తమ పార్టీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ రాజకీయ కుట్రకు వ్యతిరేకంగా తమ పదవులకు రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిర్ణయించారని సమాచారం. ప్రస్తుతం టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలున్నారు. వీళ్లంతా మూకుమ్మడి రాజీనామాలు చేసి జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్టును హాట్ టాపిక్గా మార్చాలనే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. జగన్ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ఆయనకు అడ్డుకట్ట వేసేందుకు రాజీనామాలు సరైన అస్ర్తమని టీడీపీ భావిస్తోందని టాక్.
ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లోనే ఉమ్మడిగా రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఎంపీలు కూడా సరైన సమయం చూసుకుని రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్. తమ రాజీనామాల ద్వారా చంద్రబాబు అక్రమ అరెస్టు విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ నేతలు రెడీగా ఉన్నారని తెలిసింది. అయితే అసెంబ్లీ తొలి రోజే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. లేకపోతే రెండు మూడు రోజులు బాబు అరెస్టుపై చర్చకు పట్టుబట్టి అనంతరం రాజీనామా చేస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరి టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 20, 2023 1:26 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పనిచేస్తోందని ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ యువనాయకుడు,…
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో పోటాపోటీగా…