టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన పలు పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో జరిగిన విచారణలో ఊరట లభించని సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందని ఆయన తరఫు లాయర్లు ఆశించగా…ఆ విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది.
ఇక, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తయినా తీర్పు, ఉత్తర్వులు రెండ్రోజుల తర్వాత వెల్లడిస్తామని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన చంద్రబాబు, టీడీపీ శ్రేణులకు ఏపీ సీఐడీ మరో షాకిచ్చింది. ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ ను విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ దాఖలు చేసింది.
ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ పిటీషన్ ను దాఖలు చేశారు. దీంతో, ఆ పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడంతో చంద్రబాబుకు మరో షాక్ తగిలినట్లయింది. ఫైబర్ నెట్ స్కాంలో రూ.121 కోట్లు దారిమళ్లాయని సీఐడీ పేర్కొంది.
గతంలో ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేసిందని, 2021లోనే 19 మందిపై కేసు నమోదైందని వెల్లడించింది. టెర్రా సాఫ్ట్ కు అక్రమంగా టెండర్ కట్టబెట్టారని ఆరోపించింది. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర కూడా ఉందని గతంలో సీఐడీ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ఎఫ్ఐఆర్‌లో ఏ1గా వేమూరి హరిప్రసాద్, ఏ2గా మాజీ ఎండీ సాంబశివరావు ఉన్నారు.
ఇక, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే చంద్రబాబుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో పీటీ వారెంట్ దాఖలైంది. ఇపుడు తాజాగా ఫైబర్ నెట్ స్కాంలో కూడా పీటీ వారెంట్ జారీ కావడం, ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడం సంచలనం రేపింది. ఈ మూడు వ్యవహారాలతో పాటు చంద్రబాబుపై మరిన్ని కేసులు పెట్టేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on September 20, 2023 6:33 am
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…