పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలే ఉంటాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని ఈ రోజు ఉదయం పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. జీ-20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రపంచ భవిష్యత్తుకు భారత్ ఆశాకిరణంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్ పయనిస్తోందన్న ఆయన.. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోందని ప్రధాని అన్నారు. దేశాభివృద్ధి నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నామన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ఐదు రోజులు మాత్రమే కేటాయించినా.. సమావేశాలు జరుగుతున్న సందర్భం చాలా గొప్పదని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నామని ప్రధాని తెలిపారు.
ఏడుపులకు సమయం కాదు!
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ సభ్యులంతా ప్రత్యేక సమావేశాలకు హాజరుకావాలని కోరుకుంటున్నామని, ఏడుపులు, విమర్శలకు ఇది సమయం కాదని వ్యాఖ్యానించారు. విశ్వాసం, సానుకూల దృక్పథంతో సభలను నిర్వహించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. సభ్యులంతా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొంటారని ఆశిస్తున్నామని ప్రధాని అన్నారు.
This post was last modified on September 18, 2023 4:31 pm
వైసీపీలో నాయకులు బయటకు రావడం లేదు. ఎన్నికలు పూర్తయి ఏడాది అయినా పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. నోరు…
వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పనిచేస్తోందని ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ యువనాయకుడు,…
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…