రాబోయే తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గట్టిగా ప్రయత్నిస్తే.. శక్తివంచన లేకుండా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవొచ్చనే అంచనాలతో హస్తం పార్టీ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు.. ప్రజలు కాంగ్రెస్ గురించి మరింత ఎక్కువగా మాట్లాడుకునేందుకు పార్టీ రంగంలోకి దిగింది. తొలిసారి హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ సారి సీడబ్ల్యూసీ సమావేశాల కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా హైదరాబాద్ ను వేదికగా ఎంచుకుంది.
ఈ సమావేశాలు ముగియగానే 17న సాయంత్రం జరిగే విజయభేరి సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సహా జాతీయ అగ్ర నాయకులు పాల్గొంటారు. ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభతో ఎన్నికలకు సమరోత్సాహంతో సిద్ధమవాలని కాంగ్రెస్ చూస్తోంది. అందుకే వీటి నిర్వహణకు భారీగా ఖర్చు పెడుతోందని తెలిసింది. తాజ్ క్రిష్ణలో జరుగుతున్న రెండు రోజుల సమావేశాలకు వచ్చే నాయకుల కోసం 130 గదులను పార్టీ బుక్ చేసింది. అలాగే జాతీయ మీడియా ప్రతినిధుల కోసం మరో హోటల్లోను భారీగానే గదులను రెంటుకు తీసుకుంది.
ఇక ఢిల్లీ నుంచి నేతలు రావడానికి, పోవడానికి విమాన ఖర్చులు కూడా ఉంటాయి. వీళ్లకు ప్రైవేటు భద్రత కూడా ఉంటుంది. అంతే కాకుండా విజయభేరి సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇలా వీటన్నింటికీ కలిపి రూ.కోట్లలోనే ఖర్చు అవుతుందని సమాచారం. అయినప్పటికీ కాంగ్రెస్ ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతుందనే చెప్పాలి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ వేగంగా అడుగులు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on September 17, 2023 10:13 am
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…