చాన్నాళ్ల తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన విమర్శలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాలుగా ఉన్న నీటి వివాదాన్ని పరిష్కరించలేని వ్యక్తి… తనను తాను విశ్వ గురువుగా పరిగణించుకుం టూ ప్రచారం చేసుకుంటున్నారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు గుప్పించారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చమని అనేక సందర్భాల్లో తాను స్వయంగా కేంద్రానికి లేఖలు రాశానని.. అయితే, ఇప్పటికీ చేతకాని దద్దమ్మ మాదిరిగా కేంద్రం వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు.
శనివారం పాలమూరు ఎత్తిపోతల పథకం మొదటి పంప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. స్థానిక సాగునీటికి నీటిని విడుదల చేశారు. అనంతరం కొల్లాపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. “దక్షిణ తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. పాలమూరు ప్రజలంటే ఒకప్పడు అడ్డా కూలీలు. అయితే, వారి తలరాతలు మారాయి. ఈ రోజు తెలంగాణ ప్రజలే.. ఇతర రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకుంటున్నారు” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తాను తెలంగాణ సాధించానని కేసీఆర్ చెప్పారు. అయితే, కొందరు నేతల కారణంగానే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. గత పాలకులు పదవుల కోసం ఆశలు పడి పాలమూరు జిల్లా నీటివాటా గురించి అడగలేదని విమర్శలు గుప్పించారు. ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారని వ్యాఖ్యానించారు.
“మన నీళ్లు ఏపీకి తరలిస్తుంటే.. ఈ జిల్లా నేతలు జెండాలు ఊపారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే మోడీకి చేతకావటం లేదు. విశ్వగురువుగా మాత్రం తనను తాను ప్రచారం చేసుకుంటున్నాడు. అలా చెప్పుకునే మోడీ.. 9ఏళ్లుగా మన నీళ్ల వాటా తేల్చలేదు. బీజేపీ నేతలను పాలమూరు జిల్లా ప్రజలు నిలదీయాలి. పదేళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్‌కు ఎందుకు ప్రతిపాదనలు పంపటం లేదో ప్రశ్నించాలి” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
This post was last modified on September 16, 2023 10:03 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…