స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయాన్ని జాతీయ స్థాయిలో హైలెట్ చేయాలన్న లోకేష్ ప్లాన్ ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో బాబు అరెస్టు హాట్ టాపిక్ గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ నేతలు కూడా ఈ విషయంపై స్పందిస్తుండటమే అందుకు నిదర్శనమని చెప్పొచ్చు.
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో నిధులు మళ్లించారనే ఆరోపణలతో ఆయన్ని సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 14 రోజల రిమాండ్ మీద బాబు జైల్లో ఉన్నారు. బాబు అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐ యామ్ విత్ బాబు అంటూ టీడీపీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు, ఐటీ ఉద్యోగులు కూడా బాబుకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారు.
మరోవైపు జైల్లో చంద్రబాబుతో చర్చించిన తర్వాత నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. బాబు అరెస్టును జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాలన్నదే లోకేష్ ప్లాన్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు న్యాయవాదులు, మీడియాతో లోకేష్ మాట్లాడుతున్నారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మీడియా చర్చల్లో పాల్గొంటున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని జాతీయ మీడియాతో చెబుతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే వాదనను లోకేష్ బలంగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ నెల 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బాబు అరెస్టు అంశాన్ని ప్రస్తావించేలా తమ ఎంపీలకు మార్గనిర్దేశనం చేయనున్నారు. అలాగే ఈ విషయంలో ఇతర జాతీయ పార్టీల మద్దతునూ లోకేష్ కోరే అవకాశం ఉంది.
This post was last modified on September 16, 2023 5:27 pm
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…