స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో 341 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ అధినే త చంద్రబాబును అరెస్టు చేయడంతోపాటు.. ఆయనను రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా గత నాలుగు రోజులుగా ఏపీ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక, దేశవ్యాప్తంగా కూడా కీలక జాతీయ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, ఉద్యమ కారులు కూడా చంద్రబాబుకు మద్దతు పలికారు. ఈ పరంపరలోనే చంద్రబాబు విజన్ కారణంగా తమ జీవితాలు బాగు పడ్డాయని, తమకు ఉన్నతస్థాయి కొలువులు దక్కడంతోపాటు తమ కుటుంబాలు కూడా మెరుగు పడ్డాయ ని.. అలాంటి నాయకుడిని జైలు పాలు చేయడం అక్రమమని పేర్కొంటూ.. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యో గులు ఉద్యమ బాట పట్టిన విషయం తెలిసిందే.
అయితే, తెలంగాణ పోలీసులు.. ఉద్యమం చేస్తున్న ఐటీ ఉద్యోగులను నిలువరిస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని అడ్డుకుని.. ఇళ్లకు పంపించడమో.. లేక ఐడీ కార్డులు తీసుకుని బెదిరించడమో చేశారు. ఇక, మరి కొందరిని స్టేషన్‌కు కూడా తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కూడా చంద్రబాబుకు దన్నుగా ఐటీ ఉద్యోగులు చేపట్టిన ఉద్యమాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. మరింత దూకుడుగా ఐటీ ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు.
తాజాగా శనివారం.. రెండు వినూత్న నిరసనలకు ఐటీ ఉద్యోగులు పిలుపునివ్వడం చంద్రబాబు విషయంలో వారు చూపిస్తున్న అభిమానాన్ని చాటుతోందని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా శనివారం.. ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఐటీ ఉద్యోగులు ప్రణాళిక రెడీ చేసుకున్నారు. అదేవిధంగా మణికొండలోని ఐటీ కార్యాలయాల ముందు.. మౌన దీక్షకు రెడీ అయ్యారు.
ఇక, పోలీసులు కనుక అనుమతించని పక్షంలో నల్ల రిబ్బన్లు ధరించి విధుల్లో పాల్గొని చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేందుకు రెడీ అయ్యారు. మొత్తంగా చూస్తే.. బాబు విషయంలో ఐటీ ఉద్యోగుల దూకుడు ఏమాత్రం తగ్గక పోవడం గమనార్హం.
This post was last modified on September 16, 2023 10:28 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…