ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఆ పార్టీ యువనేత నారా లోకేష్ నాయకత్వానికి తగిన రాజకీయ పరిణతి సాధించారా? ఎత్తులు – పై ఎత్తులకు వేదికైనా ఏపీ పాలిటిక్స్ లో…. తన తండ్రి, టీడీపీ రథసారథి చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే చతురతను లోకేష్ సాధించారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
స్కిల్ ట్రైనింగ్ స్కాంలో నిందుతుడిగా పేర్కొంటూ చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ సందర్భంగా మరియు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు లోకేష్ లో పెరిగిన రాజకీయ చతురతను, కార్యదక్షత నైపుణ్యాన్ని స్పష్టం చేస్తున్నాయని పలువురు విశ్లేషిస్తున్నాను. చంద్రబాబు అరెస్టు సందర్భంగా తమ నిరసనను తెలిపిన వైఖరి, దీంతోపాటుగా శ్రేణులని సమీకరించిన తీరు, అనంతరం పార్టీ నేతలను సమన్వయం చేసుకున్న విధానం లోకేష్‌లో నాయకత్వ లక్షణాలను స్పష్టం చేశాయని అంటున్నారు. చంద్రబాబు అరెస్టు పట్ల ఇటు వ్యక్తిగతంగా తన వైఖరిని తెలియజేస్తూ అటు పార్టీ పరంగా టీడీపీ విధానాన్ని పేర్కొంటూ లోకేష్ విడుదల చేసిన లేఖ, అందులో ప్రస్తావించిన అంశాలు లోకేష్ తనకు తెలుగుదేశం పార్టీ పట్ల, పార్టీ కార్యకర్తల పట్ల, ఏపీలోని పరిణామాలు పట్ల ఎంత అవగాహన ఉందో తెలియజెప్పిందని పేర్కొంటున్నారు.
ఇక చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించిన అనంతరం సైతం లోకేష్ మెరుగైన పనితీరుతో పార్టీ నేతలను ఆకట్టుకున్నారని పేర్కొంటున్నారు. ఇటు కుటుంబపరంగా తన తల్లికి, అటు పార్టీపరంగా నేతలు, కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పే విధంగా లోకేష్ నడుచుకున్నారని ఆ పరిణామాలను గమనిస్తే చెప్పవచ్చు. దీంతో పాటుగా తమ పార్టీతో సఖ్యత కొనసాగిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం అవడం, రాజమండ్రి జైలుకు పవన్ కళ్యాణ్ వచ్చి సంఘీభావం తెలిపేలా సమన్వయం చేసుకోవడం పూర్తిగా లోకేష్ నాయకత్వంలోని నిర్ణయమని పేర్కొంటున్నారు. కీలకమైన పొత్తుల ప్రక్రియకు సంబంధించి ప్రకటన వెలువడేలా చేయడంలో లోకేష్ కీలక భూమిక పోషించారని విశ్లేషిస్తున్నారు. తన మామ బాలకృష్ణ కూడా వీటిలో భాగస్వామ్యం పంచుకున్నప్పటికీ అందులో కీలక పాత్ర పోషించింది లోకేష్ అని ఆయా పరిణామాలను గమనించిన వారు పేర్కొంటున్నారు.
రాజకీయం అరంగేట్రం చేసిన కొత్తలో…చంద్రబాబు తర్వాత టిడిపిని నడిపించే నాయకుడు ఇతనేనా? అనే అనుమానం లోకేష్ కలిగించినప్పటికీ, తదుపరి ఆయన అడుగులు రాటుదేలేలా మార్చాయని అంటున్నారు. పార్టీలో చేపట్టిన కార్యక్రమాలు, మంత్రిగా & ఎమ్మెల్సీగా గడించిన అనుభవం, ముఖ్యంగా ఇటీవలి వరకు నిర్వహించిన యువగళం పాదయాత్రతో ప్రజల్లో మమేకమైన తీరు ఆయన రాజకీయ కార్యదక్షత మెరుగుపడేందుకు దోహదపడ్డట్లు చెప్తుననారు. ఈ అనుభవాలు చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలలో వ్యక్తం అయ్యాయని విశ్లేషకులు పేర్కొన్నారు. తాజాగా లోకేష్ ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు అరెస్టు గురించి తెలియజెప్పిన విధానం లోకేష్ సందర్భోచిత చర్యలకు నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. లోకేష్ ముందుకు సాగుతున్న తీరు తమ పార్టీని నడిపించేందుకు యువనేత తగు సామర్థ్యాన్ని సంపాదించారనే విషయాన్ని స్పష్టం చేస్తుందని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on September 15, 2023 8:16 pm
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. అప్పటిదాకా వచ్చిన…
కాంగ్రెస్ పాలనలో కేవలం ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గణతంత్ర…
భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు…
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద…
రాజకీయ నేతలు నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగిపోతూ ఉంటారు. ఇక అధికారంలో ఉన్న పార్టీల నేతలైతే.. క్షణం తీరిక…