టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, వయసు, హోదా రీత్యా ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని ఆయన కుటుంబం, ముఖ్యంగా బాబు సతీమణి భువనేశ్వరి తీవ్ర ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారుకూడా. ఈ క్రమంలో తన భర్తను మరోసారి పరామర్శించేందుకు, ఆయనకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించేందుకు భువనేశ్వరి ప్రయత్నించారు.
ఈ క్రమంలో శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్ కోరుతూ.. రాజమండ్రి జైలు అధికారులకు ఆమె అప్పీల్ చేసుకున్నారు. అయితే.. ఈ ములాఖత్ అప్పీల్‌ను రాజమండ్రి జైలు అధికారులు తిరస్కరించారు. మీకు ఛాన్స్ లేదు. అంటూ.. ఆమెకు తేల్చి చెప్పారు. దీంతో భువనేశ్వరి మరింత ఆవేదనలో మునిగిపోయారు. వాస్తవానికి చంద్రబాబును అరెస్టు చేసి., జైలుకు తరలించిన రోజు నుంచి నారా బ్రాహ్మణి, భువనేశ్వరి కూడా రాజమండ్రిలోనే ఒక హోటల్‌లోనే ఉంటున్నారు.
నిత్యం అక్కడి నుంచే చంద్రబాబు ఆహారం పంపిస్తున్నారు. అదేవిధంగా ఆయనకు మందులు కూడా అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం ములాఖత్ కు అవకాశం ఉన్నా కాదనడంపై భువనేశ్వరి విచారం వ్యక్తం చేశారు. అయితే.. జైలు అధికారుల వివరణ మరో విధంగా ఉంది. ఇప్పటికి వారంలో మూడు సార్లు ములాఖత్‌లు అయిపోయాయని అంటున్నారు.
వాస్తవానికి రిమాండ్ ఖైదీలను వారంలో మూడు సార్లు ఎవరైనా(ఖైదీకి నచ్చినవారు) కలుసుకునే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే ఈ వారంలో ఒకసారి భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. రెండోసారి చంద్రబాబు తరఫునవాదనలు వినిపిస్తున్న సిద్దార్థ లూథ్రా తదితర న్యాయవాదులు ములాఖత్ అయ్యారు. మూడోసారి జనసేన అధినేత పవన్, టీడీపీ నాయకుడు బాలకృష్ణ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు భేటీ అయ్యారు. ఈ క్రమంలో వారంలో మూడు సార్లు నిబంధన ప్రకారం మూడు ములాఖత్‌లు అయిపోయాయని, మళ్లీ సోమవారం వరకు ఎవరినీ అనుమతించేది లేదని జైలు అధికారులు వివరించారు.
This post was last modified on September 15, 2023 1:40 pm
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…