బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉరఫ్ చిన్నమ్మ కోపంతో రగిలిపోతున్నారట. ఆమె రక్తం 100 డిగ్రీల సెల్షియస్‌లో రగిలిపోతోందట. మాటల తూటాలు, విమర్శల శతఘ్నులతో వైసీపీ సర్కారుపై యుద్ధం చేయాలని ఉందట. కానీ, ఆమె అన్నింటినీ తమాయించుకుని.. పార్టీ అధిష్టానం గీసిన గీతలో తర్జన భర్జన పడుతున్నారట.- ఇదీ రాష్ట్ర బీజేపీ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత చర్చ. ఏ ఇద్దరు కమలం పార్టీ నాయకులు కలిసినా.. ఇదే విషయం చర్చకు వస్తోంది.
సొంత బావ, టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ సర్కారు జైల్లో పెట్టడం, సొంత సోదరి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన భర్త పరిస్థితిని కళ్లారా చూసి తల్లడిల్లడం, కన్నీటి పర్యంతం కావడం, సొంత సోదరుడు, ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలయ్య స్వయంగా రోడ్డెక్కి నిరసనలు చేపట్టేందుకు రెడీ కావడం వంటి పరిణామాలు సహజంగానే రక్త సంబంధం ఉన్న పురందేశ్వరికి రాజకీయాలకు అతీతంగా ఆవేదన కలిగిస్తున్నాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
అయితే, పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు కూడా చంద్రబాబు అరెస్టు విషయంలో ఎలాంటి స్పందనా తెలియజేయలేదు. ఏ విధంగా ఈ విషయంపై స్పందించాలనేది కూడా రూట్ మ్యాప్ ఇవ్వలేదు. పైగా ఈ విషయంలో ఎవరూ తొందర పడొద్దు అని మాత్రం పై నుంచి సమాచారం రావడంతో ఏపీకి చెందిన బీజేపీ నాయ కులు ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు. అయితే, బీజేపీకి దూరంగా.. టీడీపీకి దగ్గరవ్వాలని అనుకుంటున్న ఒకరిద్దరు మాత్రమే స్పందించారు.
కానీ, మరో వైపు పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరికి మాత్రం ఈ విషయంపై తక్షణం స్పందించాల ని ఉన్నప్పటికీ.. వైసీపీ అక్రమ అరెస్టుపై గళం విప్పాలని, విరుచుకుపడాలని ఆమె శతథా ప్రయత్నిస్తు న్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడం, పైగా నందమూరి కుటుంబం యావత్తు కూడా తీవ్రమైన షాక్‌లో ఉండడంతో పురందేశ్వరి పరిస్థితి కక్కలేక మింగలేక.. అన్న విధంగా ఉందని బీజేపీ నాయకులు చెబుతుండడం గమనార్హం.
This post was last modified on September 15, 2023 1:01 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…