బీఆర్ఎస్ అభ్యర్ధులపై పార్టీ జనాలతో పాటు మామూలు జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోతోంది. కేసీయార్ అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికి నెల రోజులవుతోంది. దీనివల్ల ఒకవైపు అభ్యర్ధులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మామూలుగా ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి మహాయితే పోలింగ్ వరకు 20 రోజులుంటే ఎక్కువ. కాబట్టి ఖర్చుల విషయంలో ఏదో మ్యానేజ్ చేసుకుంటారు. కానీ ఇపుడు నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేశారు.
దీనివల్ల ఏమైందంటే అభ్యర్థుల ఖర్చులు తడిసిమోపడవుతోంది. ఇంట్లో నుండి అడుగుబయటపెడితే చాలు ఖర్చులకు డబ్బులు ఎగిరిపోతున్నాయి. ఇలా ఎంతకాలం ఖర్చులు పెట్టాలో అర్ధంకాక అభ్యర్ధులు దిక్కులు చూస్తున్నారు. ఖర్చులను తట్టుకోలేక అభ్యర్ధులు నేతలు, క్యాడర్ కు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దాంతో నేతలు, క్యాడర్లో అభ్యర్ధులంటే వ్యతిరేకత పెరిగిపోతోంది. అసలే మామూలు జనాల్లో తీవ్ర వ్యతిరేకతుంది.
ఇవన్నీ చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 119 నియోజకవర్గాల్లో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా లేదా కూటమికైనా కనీసం 61 సీట్లు దాటాలి. సంక్షేమపథకాలు సంపూర్ణంగా అమలుకాక, మంత్రులు, ఎంఎల్ఏలపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న నేపధ్యంలో హ్యాట్రిక్ కొట్టడం అనుమానమే అనే ప్రచారం పెరిగిపోతోంది. తెలంగాణా ఎన్నికలు వచ్చే ఏప్రిల్, మే నెలల్లో జరిగే అవకాశం ఉందని కేటీయార్ చేసిన ప్రకటనతో అభ్యర్ధులకు దిమ్మతిరిగింది. నాలుగు నెలల ముందు ప్రకటిస్తేనే అభ్యర్ధులు ఖర్చులు తట్టుకోలేక చేతులెత్తేస్తున్నారు.
అలాంటిది మరో నాలుగు నెలలు అంటే మొత్తం ఏడెనిమిది నెలలు నేతలు, క్యాడర్ కు ఖర్చులు పెట్టుకోవాలంటే అయ్యేపనికాదని చాలామంది అభ్యర్ధులకు అర్ధమైపోయింది. దాంతో జనాల్లో కూడా నెటిగివ్ పెరిగిపోతోంది. జమిలి ఎన్నికలని ఒకసారి, ముందస్తు ఎన్నికలని మరోసారి ఇలాగే కేంద్రం నుండి వస్తున్న లీకులతో కేసీయార్ తో పాటు యావత్ బీఆర్ఎస్ యంత్రాంగం అయోమయంలో పడిపోతున్నారు. ఇదంతా చూస్తుంటే ఇంతముందుగా అసలు టికెట్లు ఎందుకు ప్రకటించానా ? అని తల పట్టుకునే స్ధితికి వచ్చేస్తున్నారు కేసీయార్. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 15, 2023 12:59 pm
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను…
అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…
భారీ అంచనాల మధ్య ఓ పెద్ద హీరో సినిమా రిలీజైందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. ఐతే ఈ…
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…